బిగ్ బాస్ 4 విజేతగా నిలిచాడు అభిజిత్. చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్నాడు. అయినా సరే.. అభిజిత్‌కి అన్యాయమే జరిగిందన్నది బిగ్ బాస్ అభిమానుల వాదన. విజేతకు 50 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించినా… చివరికి 25 లక్షలే అందాయి. దానికి కారణం… అందులోని 25 లక్షలు సోహైల్ ఆఫర్ రూపంలో అందుకున్నాడు. టాప్ 3 కంటెస్టెంట్లు ఉన్నప్పుడు గోల్డెన్ సూట్ కేస్.. ఆఫర్ ఫ్రేమ్ లోకి వచ్చింది. సూట్ కేస్ లో ఉన్న 25 లక్షలతో ఎవరైనా సరే, టాప్ 3 నుంచి తప్పుకోవచ్చని నాగ్ ఆఫర్ ఇస్తే.. మరో మాట లేకుండా సోహైల్ దాన్ని అందుకుని బయటకు వచ్చేశాడు. దాంతో సోహైల్ టాప్ 3కే పరిమితం అయ్యాడు. అయినా సరే, 25 లక్షలు వచ్చినట్టైంది. అయితే ఈ సొమ్ము… విన్నర్‌కి ఇచ్చే క్యాష్ ప్రైజ్ నుంచి తగ్గించారన్న విషయం ఆ తరవాత నాగ్ బయటపెట్టాడు. అంటే విజేతకూ.. 3 వస్థానంలో నిలిచి సోహైల్‌కీ ఒకటే బహుమతి అన్నమాట.
బిగ్ బాస్ లో ఎవరు ఎన్ని ఆఫర్లైనా ఇవ్వొచ్చు. అయితే.. ఆ డబ్బుని విన్నర్ కి ఇచ్చే క్యాష్ ప్రైజ్ నుంచి తగ్గించి ఇవ్వడమేమిటి? అన్నది అందరి వాదన. విజేతకి అందాల్సిన దాంట్లో కోత విధించే దానికి ఆఫర్ ఇవ్వడమేమిటి? సోహైల్‌కి 25 లక్షలు వచ్చినా, చిరు-నాగ్ చెరో పది లక్షలు ప్రకటించారు. అందులో 10 లక్షలు.. అనాథ ఆశ్రమానికి వెళ్తాయి. మిగిలిన పది..లో సోహైల్, మెహబూబ్ పంచుకుంటారు. అంటే… సోహైల్ కి మొత్తంగా 30 లక్షలు వచ్చాయన్నమాట. రెండో స్థానంలో నిలిచిన అఖిల్ కి రన్నర్ గా నిలిచాడన్న సంతృప్తి తప్ప ఇంకేం మిగల్లేదు.