పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ.. మానసిక సమస్యలతో ఆ పెళ్లి బంధాన్ని నరకంగా మార్చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఆ నరకం మానసికమైనదే కాదు.. శారీరకమైన నరకంగా కూడా మార్చేసుకుంటారు ఇంకొందరు. అలాంటి వాడే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు. బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు లైంగిక అంశాలపై ఎక్కువ అవగాహన తెచ్చుకుని… ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన వ్యక్తి.. అపోహలు పెంచుకుని తొలి రాత్రే.. భార్యను చిత్ర హింసలు పెట్టి.. కేసుల పాలయ్యాడు.
ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన యువకుడికి… గుంటూరుకు చెందిన యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఇద్దరూ అంగీకరించి పెళ్లి చేసుకున్నారు. గత అక్టోబర్లోనే పెళ్లి జరిగింది. మొదటి రాత్రి ఆ వరుడు విచిత్రంగా ప్రవర్తించడంతో… వధువు కూడా.. మానసికంగా ఆందోళనలో ఉన్నాడని సరి పెట్టుకుంది. అయితే ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. ఓ రోజు.. నైటీ ధరించి.. ఆడవారిలా ప్రవర్తిస్తూ.. వికృత చర్యలకు పాల్పడ్డాడు. భార్య ప్రైవేటు పార్టులను గాయపరిచాడు. అది భరించలేని యువతి తల్లిదండ్రులకు చెప్పింది. అయితే… ఇది పెద్ద గొడవ అవుతుందనుకుని వధువు సంసారానికి పనికి రాదని.. వరుడి తల్లిదండ్రులు రివర్స్ గేమ్ ఆడారు.
చివరికి ఏం చేయాలో తెలియక.. వధువు తల్లిదండ్రులు న్యాయం కోసం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. వరుడు.. వధువుకు చేసిన గాయాలను కూడా పోలీసులకు చూపించారు. న్యాయం చేయాలని కోరారు. వరుడు సంసారానికి పనికి రాకపోడడం అంటూ ఉండదని… లైంగిక అంశాలపై… అనేక అపోహలు పెట్టుకుని ఆందోళనల వల్ల.. రకరకాల వికృతాలకు పాల్పడటం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతూ ఉంటారు.