వివాదాస్పద ప్రకటనలు చేయడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు బీజేపీ, మజ్లిస్ నేతలు. కొన్నాళ్ల క్రితం.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ .. ఓ సమావేశంలో.. తమకు గంట పాటు స్వేచ్చ ఇస్తే.. దేశాన్ని ఇస్లామీకరణ చేస్తామన్నట్లుగా ప్రకటన చేశారు. అంటే.. ఆయన ఉద్దేశం హిందువులందర్నీ.. ఏదో చేస్తామని. ఆ మాటలు అన్నందుకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. దుమారం రేగింది.ఇప్పటికీ ఆమాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా .. ఇలాంటి ప్రకటనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేశారు.కాకపోతే… సంజయ్ కాస్త సంయమనం పాటించారు.
పదిహేను నిమిషాల పాటు స్వేచ్చ ఇస్తే.. పాతబస్తీలో రోహింగ్యాలు.. పాకిస్తాన్ వాళ్లను పట్టుకుని దేశం బయటకు తరిమేస్తారని ఆయన చెప్పారు. అయితే.. ఆయన అడిగిన ఆ పదిహేను నిమిషాలు… బీజేపీ వాళ్లకు కాదు. పోలీసులకు. పోలీసులకు పావుగంట సమయం ఇచ్చి.. పాతబస్తీకి పంపితే… దేశద్రోహులందరూ తేలుతారని ఆయన అంటున్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు… పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు ఉంటున్నారని.. వారి వల్ల ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని బీజేపీ నేతలు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో దీన్ని దృష్టిలో పెట్టుకునే బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ ఆరోపణలు చేశారు.ఇప్పుడు.. దానికి కొనసాగింపు ప్రకటనలు చేస్తున్నారు. ఎంఐఎంను ప్రధానంగా టార్గెట్ చేయడం ద్వారా బీజేపీ రాజకీయలాభాలను పొందుతోంది. దాని కోసం వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తోంది. హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారని ప్రభుత్వ రికార్డులు కూడా చెబుతున్నాయి. ఇది బీజేపీకి మరింత బలాన్ని స్తోంది. ఈ దూకుడును మరింతగా కొనసాగించాలని
అనుకుంటోంది.