ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరోసారి తమ ప్రత్యేకత చూపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏం జరిగిందో.. నిన్న అంతా కళ్ల ముందు కనిపించింది. ఈ రోజు పోలీసులు ఆ ఘటనపై కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలతో పాటు పలువురు ఆయన అనుచురలపై కేసులు నమోదు చేశారు. అవి కూడా.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు రాళ్ల దాడి చేశారని ఆ దాడిలో మనోజ్ అనే వ్యక్తి గాయపడ్డాడని.. ఆ మనోజ్ అనే వ్యక్తి ఎస్సీ అని పోలీసులు చెబుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు జేసీపై కేసులు పెడుతున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. అసలు ఈ మొత్తం ఘటనలో బాధితుడు జేసీ ప్రభాకర్ రెడ్డి.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేనప్పుడు.. కత్తులు, కటార్లతో మందీ మార్భాలంతో.. దాడి చేయడానికన్నట్లుగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్లారు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. జేసీ ఇంట్లోకి వెళ్లి జేసీ మనిషిని కొట్టి పెద్దారెడ్డిపై పోలీసులు ఈగ వాలనీయలేదు. కానీ… బాధితుడైన జేసీ ప్రభాకర్ రెడ్డి పై మాత్రం అట్రాసిటీ కేసులు నమదోయ్యాయి. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు చెప్పినా న్యాయం జరగదని.. న్యాయం చేయలేరని.. పై స్థాయి నేతలు ఏది చెబితే పోలీసులు అదే చేస్తారని అందుకే తాను ఫిర్యాదు కూడా చేయనని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆయన నమ్మకాన్ని పోలీసులు వమ్ము చేయలేదు. ఆయనపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఏపీలో బాధితులపైనే ఎదురు కేసులు నమోదు చేస్తారన్న విమర్శలు కొంత కాలంగా వినిపిస్తన్నాయి. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఇలాంటి ఘటనల వల్లే వస్తుందని.. విపక్ష నేతలు మండిపడుడుతున్నారు. కొన్నాళ్లుగా పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేస్తున్నారని.. వారి ఫ్యాక్షన్ కు కూడా సహకరిస్తున్నారని.. ఇలా అయితే్.. హత్యలు చేయడానికి కూడా సహకరిస్తారని జేసీ వర్గీయులు తీవ్రమన ఆరోపణలు చేస్తున్నారు.