ఎంటర్టైన్మెంట్ సీన్లు రాసుకోవడంలో.. సిద్ధహస్తుడు అనిపించుకున్నాడు అనిల్ రావిపూడి. పరశురామ్ దీ అదే స్టైల్. `గీత గోవిందం`లో గీత దాటకుండానే ఎంతో వినోదం పండించాడు. ఎమోషన్స్ విషయంలో అనిల్ రావిపూడి కంటే కాస్త ఎక్కువే చదివాడు పరశురామ్. తన కథల్లో ఎమోషన్ అంత బలంగా ఉంటుంది. అయితే.. తన కొత్త సినిమా `సర్కారు వారి పాట`లో మాత్రం అనిల్ రావిపూడి ని ఫాలో అవ్వాలనుకుంటున్నాడట.
`సుప్రీమ్`లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్లని మెప్పిస్తూ ఓ ఫైట్ క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి. ఆ ఫైట్ ఆ సినిమాలో హైలెట్ అయ్యింది. దివ్యాంగుల మనసులతో పాటు.. అందరి హృదయాల్నీ గెలుచుకుంది. ఇప్పుడు `సర్కారు వారి పాట`లోనూ అలాంటి సీన్ ఒకటి ఉందట. దివ్యాంగుల నేపథ్యంలో ఓ ఫైట్ ఈ సినిమాకి హైలెట్ అవుతుందని సమాచారం. ఓ దివ్యాంగుడి కోసం కథానాయకుడు చేసే పోరాటం.. `నెవర్ బిఫోర్`లా ఉండబోతోందని తెలుస్తోంది. బహుశా.. ఈ చిత్రానికి ఇంట్రవెల్ ముందొచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఇదే కావొచ్చు. ఈ సీన్ చెబుతున్నప్పుడు మహేష్ బాబు చాలా ఇంప్రెస్ అయ్యాడట. సిల్వర్ స్క్రీన్ పై ఈ ఫైట్ వేరే రేంజ్ లో ఉండబోతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. మరి ఆ ఫైట్ నేపథ్యం ఏమిటో… దాంట్లో పరశురామ్ తనదైన మార్క్ ఎలా వేశాడో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.