హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ రంగంలో మాజీ నంబర్ 1 అయిన కెరోలిన్ వాజ్నియాకి సంచలనం సృష్టించింది. స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ అనే స్విమ్ సూట్ మేగజైన్కోసం కేవలం బాడీ పెయింట్‌తో ఫోటో షూట్ చేసింది. ఆ బాడీ పెయింట్ ఎంత సహజంగా ఉందంటే ఆమె నగ్నంగా ఉన్నట్లు నిశితంగా చూస్తేగానీ ఎవరూ కనిపెట్టలేరు. రొండా రూసీ, లిండ్సే వోన్‌తో కలిసి ఈ ఫోటో షూట్లో పాల్గొంది. కెరీబియన్ దీవులలో చేసిన ఈ ఫోటో షూట్‌కు 15 గంటల సమయం పట్టిందట. ఈ ఫోటో షూట్‌ను బాగా ఎంజాయ్ చేశానని, తన బాడీ పెయింట్ తనకు బాగా నచ్చిందని, ఇది నమ్మశక్యం కాని అనుభవమని కెరోలిన్ పేర్కొంది.
కెరోలిన్ స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ మేగజైన్ గత ఏడాది రిలీజ్ చేసిన స్విమ్ సూట్ ఎడిషన్‌కు కూడా ఫోటో షూట్ చేసింది. డెన్మార్క్‌కు చెందిన ఈమె గతంలో 67 వారాలపాటు డబ్ల్యూటీఏ వరల్డ్ నంబర్ 1గా కొనసాగింది. ఒక స్కాండినేవియన్ దేశానికి చెందిన మహిళ ఈ ర్యాంక్‌కు చేరుకోవటం అదే ప్రథమం.
Hey NYC, come meet me at the Altman Building and celebrate #SISwim 2016! I'll be there around 3.30☺️ pic.twitter.com/IdiMIbbcTE
— Caroline Wozniacki (@CaroWozniacki) February 15, 2016