కరోనా కొత్త వేరియంట్… తెలుగు రాష్ట్రాలకు వచ్చేసింది. యూకే నుంచి వచ్చిన వారందర్నీ ట్రేస్ చేసి.. టెస్టులు చేసిన తర్వాత వరంగల్‌లో ఒకరికి.. నెల్లూరుల జిల్లాలో మరొకరికి నిర్దారణ అయినట్లుగా అధికారులు ప్రకటించారు. వారి కాంటాక్టులందర్నీ గుర్తించి.. ఐసోలేషన్‌కు పంపే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. కానీ..యూకే నుంచి వచ్చిన వారు ఇప్పటికే జనంలో కలిసిపోయారు. వారి ద్వారా ఇతరులకు వ్యాపించి ఉంటుందన్న ఆందోళలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. మామూలు కరోనా కన్నా.. కొత్త స్ట్రెయిన్ దాదాపుగా 70 శాతం ఎక్కువగా ఇతరులకు వ్యాపిస్తుందని తేలింది. దీంతో అధికారులు హైరానా పడుతున్నారు.
కొత్త రకం స్ట్రెయిన్ కరోనాపై.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆందోళన చెందుతోంది. బ్రిటన్‌లో మొదటగా ఇది బయటపడింది. దీంతో ఆ దేశానికి రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. ఇప్పటికే.. ఆ దేశం నుంచి వచ్చిన వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉన్నారు. వారందర్నీ ట్రేస్ చేయడానికి అధికార యంత్రాంగం అంతా తంటాలు పడుతోంది. చాలా మంది పాస్‌పోర్టు ఉన్న చిరునామాల్లో ఉండటం లేదు. దాంతో వారందర్నీ పట్టుకోవడం కష్టంగా మారింది. వారి ద్వారా.. కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తుందన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది.
కరోనా వైరస్ ఏపీలోకి వచ్చినప్పుడు మొదటి కేసు నెల్లూరులోనే బయటపడింది. విదేశాల నుంచి వచ్చిన యువకుడికి కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్ కూడా… నెల్లూరులోనే బయట పడింది. దీంతో నెల్లూరు ప్రజలు హడలి పోతున్నారు. కరోనా పరిస్థితులు దేశంలోకి ప్రవేశించినప్పుడు.. ఎలాంటి భయాందోళనల పరిస్థితులు ఉండేవో.. ఇప్పుడు కూడా.. అలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి. ప్రజల్లో ఓ రకమైన భయం కనిపిస్తోంది. మల్లీ లాక్ డౌన్ వేస్తారన్న ఆందోళన కూడా… అందరిలోనూ ప్రారంభమయింది. ఇతర దేశాల్లో బయట జన సంచారంపై ప్రభుత్వాలు…. ఆంక్షలు విధిస్తున్నాయి.