విరాట్ కోహ్లీ లేని జట్టు ఎలా ఆడుతుందో.. ఎలా గెలుస్తుందో అని బెంగ పెట్టుకున్న టీమిండియా ఫ్యాన్స్‌కి… మాజీ క్రికెటర్లకు.. టీమ్ మొత్తం సూపర్ షాక్ ఇచ్చింది. రెండో టెస్టులో ఏ మాత్రం… తడబడకుండా… కంగారూలను కంగారు పెట్టించింది. నాలుగో రోజునే ఆటను పూర్తి చేసింది. సాధికారికమైన విజయాన్ని నమోదుచేసింది. అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కు వెన్నుముకలా నిలవగా.. కెప్టెన్సీతోనూ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రహానేకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పది మంది కలిసి 36 పరుగులు మాత్రమే చేయడంతో… భారత ఆటగాళ్ల బ్యాటింగ్ సామర్థ్యం ఆస్ట్రేలియాపిచ్లపై పేకమేడల్లా మారిపోయింది. దీంతో రెండోటెస్టులో వారి ఆట ఎలా ఉంటుందోనన్న చర్చ ముందుగానే ప్రారంభమయింది. అదే సమయంలో.. విరాట్ కోహ్లీ.. తన వ్యక్తిగత పర్యటన కోసం.. టీమ్‌ను వదిలారు. ఇండియాకు వెళ్లిపోయాడు. దాంతో.. కెప్టెన్సీ రహానే దక్కింది. కోహ్లీ వెళ్లిపోవడంతో ఆటగాళ్లలో మరింత ఆభద్రత ఉంటుందని అనుకున్నారు. కానీ కుర్రాళ్లు.. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ తమ ప్రతిభను చూపారు. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుకే ఆలౌట్ చేసిన టీమిండియా ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ 200 దాటనీయలేదు. రెండువందలకే పరిమితం చేశారు.
తొలి ఇన్నింగ్స్‌లో రహానే సెంచరీ చేయడంతో భారత్ స్కోరు 326కు చేరుకుంది. కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం రావడం… రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియాను కట్టడి చేయడంతో.. లక్ష్యం 70 పరుగులుగా తేలింది. ఆ డెభ్బై పరుగుల్ని భారత్ ఆడుతూ పాడుతూ చేధించిది. తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లోనే భారత్ పేకమేడలా కుప్పకూలిపోవడంతో.. చాలా మంది దృష్టిలో అదే ఉంది. కానీ.. అలాంటి పరిస్థితిని మళ్లీ రానీయలేదు. మయాంక్, పుజారా స్వల్పస్కోరే అవుటైనా… శుభ్‌మన్ గిల్, పుజారా మిగతా పని పూర్తి చేశారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ , ఆస్ట్రేలియా చెరో టెస్టు గెలుచుకుని సమఉజ్జీగా ఉన్నాయి.