హైదరాబాద్లో మ్యూజిక్ టీచర్ను ప్రేమ పేరుతో వంచించి… శారీరంగా లోబర్చుకుని.. చివరికి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న చెరుకు కరణాకర్ రెడ్డి అనే వ్యక్తిపై జూబ్లిహిల్స్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇతను కరన్ కాన్సెప్ట్స్ అనే సంస్థకు ఎండీ. ఇతను లో ప్రోఫైల్ మెయిన్టెయిన్ చేస్తాడు. కరణ్ కాన్సెప్ట్స్ పేరుతో ఇతను చేసేది సోషల్ మీడియా ప్రచారం. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉంటూ.. ప్రచారం చేస్తూ వస్తున్నారు. దరువు పేరుతో వైసీపీకి మద్దతుగా… ఇతర పార్టీల నేతలపై బూతులతో విరుచుకుపడే వెబ్ సైట్ ఒకటి ఉంది.
దానికి ఈ కరన్ రెడ్డినే ఓనర్. దరువు బూతులు వైసీపీకి బాగా నచ్చాయేమో కానీ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయనకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని చెబుతున్నారు. ఈ కరణ్ రెడ్డి… తెలంగాణ రాష్ట్ర సమితికి సోషల్ మీడియా ప్రచారకర్తగా కూడా ఉన్నారు. తెలంగాణ అధికార పార్టీతోనూ ఆయన సన్నిహితంగా ఉంటారు. ఆయన వృత్తి సోషల్ మీడియా ప్రచారం అయితే.. ప్రవృతి ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకుని మహిళల్ని ట్రాప్ చేయడం.
శ్రీనగర్ కాలనీలోని కార్యాలయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడని సదరు యువతి పోలీసులకు సాక్ష్యాలు సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ కరణ్ రెడ్డికి.. అటు ఏపీ.. ఇటు తెలంగాణలోనూ పలుకుబడి ఉంది కాబట్టి… ఆ యువతికి న్యాయం దక్కడం అనుమానమే.