అతను నిత్యం దేవుడి స్మరణ చేసి.. ధర్మం గురించి ప్రవచనాలు వినిపించే ప్రదేశంలో పని చేసే ఉద్యోగి. కానీ రోజంతా.. అదే వింటున్నా.. అతని మనసు మాత్రం అధర్మన్నే నేర్చుకుంది. ఎంతగా అంటే.. కట్టుకున్న భార్య నగ్న ఫోటోలను.. ఆన్ లైన్లో పెట్టేంతగా.. సహధర్మచారణిని వేశ్యగా చిత్రీకరించేంతగా. ఇంత చేసింది.. ఆమె తల్లిదండ్రుల నుంచి అధిక కట్నాన్ని రాబట్టడం కోసమే.
టీటీడీకి చెందిన ఓ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రేవంత్ అనే వ్యక్తి.. కట్నం ఇవ్వలేదని భార్యను కాల్ గర్ల్‌గా మార్చేశాడు. భార్య ఫొటోలను కాలేజీ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. విషయం తెలిసి భర్త రేవంత్ ఇంటిపై భార్య తరపు బంధువుల దాడి చేశారు. అంతకు ముందు దిశ పీఎస్‌లో రేవంత్ భార్య ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కొద్ది రోజులుగా భార్య మేఘనను హింసిస్తున్నాడు రేవంత్. 10 లక్షల బంగారం, 10 లక్షల కట్నం ఇచ్చినా సరిపోలేదని వేధిస్తున్నాడు. వీరికి నాలుగు నెలల క్రితమే వివాహ ంజరిగింది.
తన భర్త ఇంత దారుణంగా వ్యవహరిస్తాడని అంచనా వేయలేకపోయిన.. మేఘన.. మొత్తం విషయం తెలిసి.. తాడోపేడో తేల్చుకోవాలనుకుంది. పోలీసులు సహకరించకపోయినా పోరాటానికి సిద్ధపడింది. భర్త రేవంత్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయితే పోలీసులు మాత్రం… ఆమె ను నియంత్రించడానికే ప్రయత్నించారు. అయితే అమె… మీడియా సాయంతో పోరాటానికి సిద్ధమయింది. రేవంత్ ఇంటి ముందు టెంట్ వేసి ధర్నా చేయడం ప్రారంభించారు.
కట్నమే ముఖ్యం అనుకునే ప్రబుద్ధుల వల్ల … కుటుంబ వ్యవస్థ ప్రమాదంలో పడుతోంది.