‘సీత’ తరవాత రెండు ప్రాజెక్టులు ప్రకటించాడు తేజ. రానాతో ఒకటి. గోపీచంద్ తో మరోటి. గోపీచంద్ సినిమాకి `అలివేలు వెంకటరమణ` అనే పేరు కూడా ఖరారు చేశాడు. అలివేలు పాత్ర కోసం కథానాయిక పాత్ర కోసం అన్వేషణ జరుగుతోంది. ఈలోగా.. ఈసినిమా నుంచి గోపీచంద్ డ్రాప్ అయ్యాడన్నది టాక్. గోపీచంద్ ప్రస్తుతం మారుతితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. రవితేజ కోసం రాసుకున్న `పక్కా కమర్షియల్` సినిమా… ఇప్పుడు గోపీచంద్ దగ్గరకు వచ్చిన సంగతి తెలిసిందే. మారుతి కోసం.. తేజ సినిమాని గోపీచంద్ పక్కన పెట్టబోతున్నాడని టాక్. తేజ కూడా… మరో హీరో కోసం అన్వేషణ ప్రారంభించాడట. త్వరలోనే కొత్త హీరో డిటైల్స్ ప్రకటించబోతున్నాడని సమాచారం అందుతోంది. రవితేజ డ్రాప్ అవ్వడంతో… మారుతి సినిమా డైలామాలో పడింది. ఇప్పుడు రవితేజ స్థానంలో గోపీచంద్ ని తీసుకోవడం వల్ల…తేజ సినిమా డైలామాలో పడినట్టైంది. ప్రస్తుతం గోపీచంద్ `సిటీమార్` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా తుది దశకు చేరుకుంది. ఆ వెంటనే మారుతి – గోపీచంద్ సినిమా మొదలైపోతుంది.