మెగాస్టార్ ఒక్కడే. అదీ చిరంజీవినే. ఈ విషయం టాలీవుడ్ మొత్తానికి తెలుసు. `ఆహా`కి మాత్రం కాస్త లేటుగా అర్థమైంది. అందుకే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి `ఆహా` క్షమాపణలు చెబుతోంది.
విషయం ఏమిటంటే… ఇటీవల `శామ్ జామ్` లో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. సమంత బన్నీని ఇంటర్వ్యూ చేసింది. అల్లు అర్జున్ ని మెగాస్టార్ గా అభివర్ణిస్తూ ప్రోమోలు కట్ చేసింది ఆహా. దీనిపై మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. మెగాస్టార్ ఒక్కడే ఉంటాడని, అది చిరంజీవినే అని, బన్నీ ఎప్పటికీ ఆస్థానానికి రాలేడని – గట్టిగానే ఇస్తున్నారు. దీందో ఆహా దిగి వచ్చింది. ప్రోమోల్లో పొరపాటు జరిగిపోయిందని, బన్నీని మెగాస్టార్గా అభివర్ణించడం తప్పేనని, చిరంజీవినే మెగాస్టార్ అంటూ క్లారిటీ ఇచ్చింది. `ఆహా` అంటేనే అల్లూ ఫ్యామిలీది. అలాంటి ఆహాలో బన్నీ ఇంటర్వ్యూ ఇస్తూ, బన్నీని మెగాస్టార్ అని అభివర్ణించడం తెలిసి తెలిసి చేసిన పొరపాటా? లేదంటే పొరపాటుగా పొరపాటు జరిగిపోయిందా? అన్నది ఆహా టీమ్ కే తెలియాలి. ఇలాంటి పొరపాట్లతో..`ఆహా` టీమ్ జనాలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతోంది? ఇండ్రస్ట్రీకి మరో మెగాస్టార్ బన్నీ అనే బజ్ క్రియేట్ చేయాలని `ఆహా` భావించిందా? మెగా ఫ్యాన్స్ తాకిడి భరించలేక.. సింపుల్ గా `సారీ` చెప్పేసిందా? బన్నీ పీ.ఆర్ విషయాల్లో చాలా క్లియర్ గా ఉంటాడు. తనపై ఓ ప్రోమో కట్ చేసినప్పుడు… అది ఎలా ఉండబోతోంది? అనేది చూసుకుంటాడు. పైగా `ఆహా` తనదే కదా. ఆ సౌలభ్యం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. తనకి తెలియకుండానే ఇలాంటి ప్రోమో బయటకు వచ్చేసిందా? అనే డౌటు వేయడం సహజం. మొత్తానికి `ఆహా` అడుసు తొక్కేసింది. ఇప్పుడు కాళ్లు కడిగే ప్రయత్నం చేస్తోంది. అంతే.