ప్రొద్దుటూరులో టీడీపీ నేత హత్య ఘటన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లోకేష్ వెళ్లడం.. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదు చేసే వరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదని ఆందోళన చేయడం.. రాజకీయవర్గాల్లో ఉత్కంఠకు కారణం అయింది. పోలీసులు ఎలా స్పందిస్తారోననే ఆందోళనతో.. టీడీపీ వర్గాలు కూడా.. టెన్షన్‌కు గురయ్యాయి. దూకుడుగా వ్యవహరిస్తే… రాజకీయంగా మరింత పోరాటం చేయవచ్చని టీడీపీ నేతలు అనుకున్నారేమో కానీ… పోలీసులు మాత్రం.. సంయమనం పాటించారు. లోకేష్‌తో చర్చలు జరిపి.. ఎమ్మెల్యేతోపాటు.. ఆయన బావమరిది బంగారు రెడ్డి… మున్సిపల్ కమిషనర్ రాధపై కేసులు నమోదు చేయడానికి అంగీకరించారు. దీంతో..లోకేష్ పోరాటం ఫలించినట్లయింది.
ఈ కేసు విషయంలో లోకేష్ అనూహ్యంగా మున్సిపల్ కమిషనర్ అనూరాధ పేరును హైలెట్ చేయగలిగారు. నిజానికి హత్యకు గురయిన సుబ్బయ్య భార్య మున్సిపల్ కమిషనర్ అనూరాధ పేరును పదే పదే చెబుతున్నారు. కానీ ఆ విషయాన్ని చాలా వరకూ.. బయటకు రాకుండా చేయగలిగారు. కానీ.. లోకేష్ కు సుబ్బయ్య హత్యలో .. మున్సిపల్ కమిషనర్ పాత్ర గురించి స్పష్టమైన సమచారం ఉండటంతో…ఆమెపై కూడా కేసు నమోదుకు పట్టుబట్టారు. ఈ వివాదంలో మున్సిపల్ కమిషనర్ పాత్రను తెరపైకి తీసుకు వచ్చారు.
మున్సిపల్ కమిషనర్ అనూరాధ సమక్షంలోనే హత్య జరిగిందనేది ఇప్పుడు ప్రొద్దుటూరులో జోరుగా సాగుతున్న ప్రచారం. ఇళ్ల స్థలాల విషయంలో బోలెడన్ని అక్రమాలు జరిగాయి. దీనిపై సుబ్బయ్య పోరాటం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్‌కు కూడా ఫోన్ చేసి.. అక్రమాలపై నిలదీసినట్లుగా తెలుస్తోంది. దీంతో మున్సిపల్ కమిషనర్.. ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డికి చెప్పుకున్నారు. దీంతో శివప్రసాదరెడ్డి అనుచరుల్ని పంపి..మాట్లాడించినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో వ్యవహారం హత్యకు దారి తీసిందన్న ప్రచారం జరుగుతోంది. హత్య జరిగినప్పటి నుండి మున్సిపల్ కమిషనర్ అనూరాధ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇది మరిన్ని అనుమానాలకు తెర తీసింది.
సుబ్బయ్య హత్య కేసు ఖచ్చితంగా రాజకీయ హత్యేనన్న అభిప్రాయం ఇప్పుడు కడప జిల్లా మొత్తం వినిపిస్తోంది. సుబ్బయ్య కాల్ లిస్ట్‌ను.. బయటకు తీస్తే.., అసలు నిందితులెవరో స్పష్టంగా తెలుస్తుందని.. వారి వెనుక ఉన్న వారెవరో బయటకు వస్తారని చెబుతున్నారు. కానీ.. ఈ విషయంలో పోలీసుల చిత్తశుద్ధిపైనే అనుమానాలున్నాయి. హత్యకు గురైన తర్వాత ఎమ్మెల్యేకు సంబంధం లేదని ఎస్పీ ఏకపక్ష ప్రకటన చేసేశారు. విచారణ కూడా చేయలేదు. దీంతో.. సుబ్బయ్య కుటుంబానికి న్యాయం జరగడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది. అయితే లోకేష్ అనూహ్యంగా… ప్రొద్దుటూరులోనే మకాం వేసి .. ఆందోళన చేయడంతో.. ఇందులో నిందితులెవరో ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగారన్న చర్చ నడుస్తోంది.