రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం `క్రాక్`. శ్రుతిహాసన్ కథానాయిక. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకి ఓ ప్రత్యేక ఆకర్షణ వచ్చి చేరింది. `క్రాక్`కి ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పాత్రల పరిచయం.. వెంకటేష్ గొంతుతో వినబోతున్నాం. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. జనవరి 1 సందర్భంగా శుక్రవారం.. `క్రాక్` ట్రైలర్ విడుదల కాబోతోంది. రవితేజ – గోపీచంద్ కాంబోలో రూపుదిద్దుకున్న రెండో చిత్రం ఇది. ఇది వరకు `బలుపు` కూడా మంచి విజయాన్ని అందుకుంది. అందులోనూ శ్రుతినే కథానాయిక. ఆ హిట్ కాంబినేషన్ `క్రాక్` తో మళ్లీ రిపీట్ కాబోతోంది. శతర్ కుమార్ తనయ వరలక్ష్మి ఈ సినిమాలో ప్రతినాయిక పాత్రలో కనిపించబోతోంది.