మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయనగరం పర్యటనకు వెళ్తున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన… నిందితుల్ని ఉద్దేశపూర్వకంగా పోలీసులు పట్టుకోవడం లేదనే నిర్ణయానికి వచ్చారు. రామతీర్థంలో ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. ఏపీలో ఆలయాలపై దాడులు నిత్యకృత్యం దురదృష్టకరమని… ప్రభుత్వ అలసత్వ వల్లే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. దుర్గమ్మ గుడిలో మాయమైన 3 సింహాలను ఇప్పటివరకు గుర్తించలేదు.. అంతర్వేదిలో రథం తగులబెట్టిన నిందితులను అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు.
చంద్రబాబు విజయనగరం పర్యటనకు వెళ్తున్నారు.. రామతీర్థం ఆలయాన్ని పరిశీలించబోతున్నారని తెలియగానే.. విశాఖలోనే ఉన్న విజయసాయిరెడ్డి… వెంటనే ఆరోపణలు ప్రారంభించారు. రామతీర్థంలో శ్రీరాముల వారి ఆలయ ధ్వంసం.. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణలు గుప్పించారు. నిందితులెవరో విచారణలో జరుగుతుందని ప్రకటించారు. విజయసాయిరెడ్డి ఆరోపణలపై నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ఏ-2 రెడ్డితో ఆరోపణలు చేయించడం ఎందుకని నేరుగా.. సింహాచలం అప్పన్న ఆలయంలో ప్రమాణం చేద్దాం రమ్మని ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ చేశారు. ఫేక్ పార్టీ..ఫేక్ సీఎం.. ఫేక్ ఆరోపణలు.. పేక్ పాలన అని విరుచుకుపడ్డారు. పింక్ డైమండ్ పేరుతో చేయించిన ఆరోపణలను లోకేష్ ప్రస్తావించారు.
ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా రాజమండ్రితో పాటు మరికొన్ని చోట్ల ఆలయాలపై దాడులు జరిగాయి. ప్రభుత్వ వైఫల్యంతో ఇప్పటికి 160కి పైగా.. ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం అయినా ప్రభుత్వం నిందితుల్ని పట్టుకోలేదు. ఓ ప్రణాళిక ప్రకారం.. ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నా..పోలీసుల స్పందన అంతంతమాత్రం. చివరికి అది సవాళ్ల వరకూ దారి తీసింది. ఏం జరిగినా చంద్రబాబు, లోకేష్ పై నెట్టేయడం.. వైసీప ీనతేలకు కామన్‌గా మారిపోయింది. కానీ.. దేంట్లోనూ ఆధారాలు చూపించలేకపోతున్నారు. దీంతో.. టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.