అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు.. కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు.. అందరి దృష్టి.. వ్యాక్సినేషన్‌పై పడింది. కేంద్రం ఇప్పటికే పెద్ద ఎత్తున డ్రై రన్ నిర్వహిస్తోంది. కొద్ది రోజుల కిందట… నాలుగు రాష్ట్రాల్లో రెండేసి జిల్లాల్లో వ్యాక్సిన్ ఎలా వేయాలో.. కసరత్తుచేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ వ్యాక్సిన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అచ్చంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో అదే పద్దతిని ఫాలో అవుతూ ప్రజలకు వ్యాక్సిన్ వేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే వ్యాక్సిన్ ఉచితమా.. ఖర్చా.. అన్నదానిపై. కేంద్రం ఇప్పటి వరకూ పెద్దగా స్పష్టత ఇవ్వలేదు. ఎక్కడ ఎన్నికలు జరిగితే.. అక్కడ బీజేపీ మేనిఫెస్టోలో వ్యాక్సిన్ ఉచితం అనే హామీ పెడుతూ వచ్చారు.
ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చే సమయం ముంచుకు వచ్చింది. ఇప్పుడు వ్యాక్సిన్ ఉచితమా.. లేక ఖర్చా అన్న చర్చ ప్రారంభమైంది. దీనిపై.. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ క్లారిటీ ఇచ్చారు. దేశ ప్రజలందరికీ టీకా ఫ్రీ అని ప్రకటించారు. విధి విధానాలు ప్రకటించలేదు కానీ.. ఓ భరోసా అయితే ఇచ్చారు. కానీ.. ప్రైవేటుగా కూడా అమ్మే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. ప్రైవేటుగా అయితే రెండు డోసులు ఎనిమిది వందలకుపైగానే ఉంటుందని.. గవర్నమెంట్‌కు తక్కువకే సీరం ఇనిస్టిట్యూట్ సప్లయి చేస్తుందని చెబుతున్నారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలంటే.. సమయం పడుతుంది. ప్రభుత్వం ప్రాధాన్యతల వారీగా.. సామాన్యులు ఆఖరిలో ఉంటారు. ముందుగా.. కోవిడ్ వారియర్స్‌కి వైద్య సిబ్బందికి.. పోలీసులకు.. ఇలా ఇస్తూ వస్తారు.
చివరికి సామాన్యులకు ఇస్తారు. అప్పటి వరకూప్రజలు ఆగే పరిస్థితి ఉండదు. మార్కెట్‌లో అందుబాటులో ఉంచితే.. వారే కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం ఈ వ్యూహాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉంది. ఉచితంగా కావాలంటే.. మన వంతు వచ్చే సరికి ఆరేడు నెలలు పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదనే పరిస్థితి ఉంది. ఎందుకంటే.. అందరికీ టీకా అవసరమే మరి..!