తేజ సినిమా `అలిమేలు మంగ – వేంకటరమణ`కి ఇప్పుడు అర్జెంటుగా హీరో కావాలి. అలివేలు పాత్ర తాప్సికి దక్కింది. ఇప్పుడు వేంకటరమణనే అవసరం. నిజానికి ఈ కథ గోపీచంద్ కి వినిపించారు. ఆయన ఓకే చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులో గోపీచంద్ లేడు. గోపీ కావాలనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడా? లేదంటే తప్పించారా? అనే చర్చ నడుస్తోందిప్పుడు.
నిజానికి `అలివేలు మంగ..` కథ గోపీచంద్ కి బాగా నచ్చింది. కాకపోతే ఈ సినిమాలో హీరో కంటే, హీరోయిన్ పాత్రకు డామినేషన్ ఎక్కువ. సాధారణంగా తేజ సినిమాల్లో జరిగేది ఇదే. అందుకే ఆ పాత్రకు స్టార్ డమ్ ఉన్న కథానాయిక కోసం అన్వేషణ ప్రారంభించాడు తేజ. కాకపోతే… గోపీచంద్ సరసన అనేసరికి హీరోయిన్లంతా సైలెంట్ అయిపోయారు. తాప్సి సైతం… `గోపీచంద్ వద్దు..` అని క్లియర్ గా చెప్పినట్టు టాక్. `మొగుడు` సినిమా వీరిద్దరి కాంబోలో వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ సెంటిమెంట్ తాప్సిని భయపెట్టి ఉంటుంది. అందుకే… తేజనే గోపీచంద్ ని తప్పించాడని తెలుస్తోంది. పైగా ఈసినిమాకి కాస్త పాన్ ఇండియా టచ్ ఇవ్వాలని తేజ భావిస్తున్నాడు. అంత క్రేజ్ ఉన్న హీరో ఈ కథకి కావాలి. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నుంచి హీరోని ఎంచుకోవాలని తేజ డిసైడ్ అయ్యాడట. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఎంట్రీ ఖరారైందని, ఆ హీరో పేరు త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. `అలివేలు..`ని… మిగిలిన భాషల్లోనూ తీసుకెళ్లాలన్నది తేజ ప్లాన్. తాప్సికి బాలీవుడ్ లో క్రేజ్ వుంది. మిగిలిన భాషా ప్రేక్షకులకు తాప్సి టచ్చే. అది కూడా తేజకు ప్లస్ అవ్వబోతోంది. సో.. ఈ కారణాల వల్లే… గోపీచంద్ ని సైడ్ చేశారన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.