గుడివాడలో పేకాట క్లబ్లపై జరిగిన పోలీసుల దాడులు రాజకీయంగానూ కలకలం రేపుతున్నాయి. మంత్రి బంధువులు కొంత మంది దొరకడం ఆ కలకలానికి కారణం కాదు. అక్కడ పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని.. రోజుకు కోట్ల కొద్దీ నగదు చేతులు మారుతుందని.. అంతర్రాష్ట్ర మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తారనేది బహిరంగ రహస్యం. చాలా సార్లు మీడియాలో కూడా వచ్చింది. కానీ ఎప్పుడూ పోలీసులు అటు వైపు చూసిన పాపాన పోలేదు. పోయే ధైర్యం కూడా చేయలేదు. కానీ ఇప్పుడే ఎందుకు దాడులు చేస్తున్నారదని ఆసక్తికరం. ముఖ్యంగా పేకాట శిబిరాల్లో అత్యధికంగా నగదు ఉండే సమయం… పేకాట రాయుళ్లు ఉండే సమయం చూసి పోలీసులు దాడి చేశారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు. ఇది ఓ రకంగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్న ప్రముఖ నాయకుడికి.. ఆయన అనుచరులకు షాక్ లాంటిది.
తమకు తెలియకుండా గుడివాడలో కనీసం పోలీస్ కానిస్టేబుల్ కూడా.. తమ శిబిరాల వైపు అడుగు పెట్టరని అంతగా అధికార యంత్రాంగంపై పట్టు సాధించామని.. వారు భావిస్తూంటారు. అది నిజం కూడా. కానీ.. నిజానికి… ఆయనకు ఉన్న పట్టు కన్నా… ఆ పై స్థాయి యంత్రాంగానికి ఉండే పట్టు ఎక్కువ. ఎప్పుడైతే .. ఆ నేతను బుక్ చేయాలనుకుంటున్నారో.. అప్పుడే.. .ఎటాక్ చేయాలని చాలా కాలంగా స్కెచ్ రెడీ చేసి పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే.. పార్టీలోనూ .. ప్రభుత్వంలోనూ ఎదురులేదనునే నేత.. విచ్చలవిడిగా అసాంఘిక వ్యవహారాలకు అనుచరుల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక్క సారిగా ఆయనపై కట్టడి ప్రారంభించారు. ఇలా ఎందుకు చేశారో..త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సామాజికవర్గ పరంగా ప్రభుత్వ పెద్దలు తీవ్ర వ్యతిరేకత చూపే వర్గానికి చెందిన సదరు నేత.. పెద్దల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. తన వ్యక్తిగత ఇమేజ్ పాతాళంలోకి వెళ్లిపోయినా… వెనక్కి తగ్గకుండా విధేయత చూపించడానికి వెనుకాడరు. అయినప్పటికీ.. పరిస్థితులు మారిపోయాయి. ఎందుకిలా అనేదానిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంది మంత్రి పదవుల్ని తీసేసి కొత్త వారికి చాన్సిస్తామని చెప్పారు. ఇలాంటి వ్యవహారాలు.. దాడులు.. వివాదాల ద్వారా ఎవరెవరికి ఎర్త్ పెట్టబోతున్నారని సూచనలు పంపుతున్నారని అంటున్నారు. ఇప్పటికే మంత్రి జయరాం.. అలాంటి ముద్రపడిపోయి.. సైలెంటయ్యాయి. ఇప్పుడు… కృష్ణా జిల్లా మంత్రి వంతు వచ్చినట్లయింది.