`ప్రతిరోజూ పండగే` తరవాత.. మారుతి సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. రవితేజ కోసం `పక్కా కమర్షియల్` కథని సిద్ధం చేశాడు. అయితే…. చివరి క్షణాల్లో హీరో మారిపోయాడు. గోపీచంద్ తో ఈ సినిమా మొదలవుతుందని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలోనూ క్లారిటీ లేదు. `ప్రతిరోజూ పండగే` తరవాత… మారుతి విషయంలో ఇలాంటి గందరగోళమే కనిపిస్తోంది. రామ్ లాంటి హీరోల పేర్లూ బయటకు వచ్చాయి. కానీ… అవన్నీ మిడిల్ డ్రాప్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో మారుతి నుంచి త్వరలో ఓ ప్రకటన రాబోతోంది. దాన్నీ వినూత్నంగా డిజైన్ చేశాడట. కోర్టు తీర్పు టైపులో.. ఓ వాయిస్ ఓవర్ టీజర్ ని విడుదల చేస్తాడని, అందులో.. తన కొత్త సినిమా డిటైల్స్ తానే స్వయంగా చెబుతాడని తెలుస్తోంది. సంక్రాంతికి మారుతి సినిమా అప్ డేడ్ ఉండొచ్చు. దాదాపుగా గోపీచంద్ ఖాయమయ్యే అవకాశాలున్నాయి. చివరి నిమిషంలో ఏమైనా మార్పులూ చేర్పులూ జరిగినా, ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.