50 శాతం ఆక్యుపెన్సీతో .. నిర్మాతలకు కాస్త నష్టం జరుగుతోంది. మెయింటినెన్సు ఛార్జీలు అలానే ఉండి, సగం ఆదాయమేరావడం… నిజంగా నష్టమే. త్వరలోనే 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తుందేమో అని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు నిర్మాతలు. తమిళ నాట ప్రభుత్వం ఇప్పుడు నిర్మాతలకు తీపి కబురు అందించింది. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఈరోజే అందుకు సంబంధించిన జీవో విడుదలైంది. త్వరలో విజయ్ సినిమా `మాస్టర్` విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని విజయ్ కోరాడు. విజయ్ లాంటి స్టార్ కోరితే… ఇక అడ్డేముంది? అందుకే అక్కడి ప్రభుత్వం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే టాలీవుడ్ లో సంక్రాంతి సందడి మొదలు కాబోతోంది. ఇక్కడా 100 శాతం ఆక్యుపెన్సీ ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై… తెలుగు ప్రభుత్వాలు కూడా ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది. 100 శాతానికి అనుమతి ఇస్తే.. సంక్రాంతి శోభ రెట్టింపు అయినట్టే.