మాధురి అలనాటి స్వప్న సుందరి. కెరీర్ లో పీక్స్ చూసిన తర్వాత ఓ డాక్టర్ గారిని పెళ్ళాడి యూఎస్ వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు బాలీవుడ్లో ఝలక్ ఇస్తూ ఫాన్స్ హార్ట్ బీట్ పెంచేస్తోంది. ఆమె తాజాగా తన ఫామిలీలోని ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పింది. వాటిలో…తన భర్త శ్రీ రామ్ నేనె చేతి వంట గురించి ప్రశంసలు కురిపించింది. అతి చిన్న వయసులోనే తాను ప్రొఫెషన్ లో బిజీ గా మారడంతో కిచెన్ లోకి వెళ్లే అవసరమే రాలేదంటూ…పెళ్లయిన తర్వాతే కొద్దికొద్దిగా వంట నేర్చుకున్నానని ఆమె తెలిపింది. తాను చేసే వంటకాలు తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నవేనని పనిలోపని తల్లికి కూడా కితాబిచ్చింది.
యుఎస్ లోని తన భర్త దగ్గర ఫ్రెంచ్ కుక్ ఉండేవాడని…అతడు కూడా మంచి వంటకాలు చేసేవాడని చెప్పింది. సమయం చిక్కినప్పుడు ఇద్దరు కలసి పోహ…అటుకుల ఉప్మా తయారు చేసుకుని ఆస్వాదించేవారట. అలాగే…పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు ప్రత్యేక వంటకాలు కూడా తయారు చేసేవారు. శ్రీరామ్ నేనె వంటకాలకు సంబంధించి వివరాల కోసం చిన్ని చిన్ని మరాఠి పదాలు కూడా నేర్చుకున్నారని మాధురి చెప్పింది. బతాత్యా బాచి అనే ఓ రుచికరమైన రసం తయారు చేసుకునేవారు. సూటిగా చెప్పాలంటే మా ఆయన కచ్చితంగా నాకంటే రుచికరమైన వంట చేయడంలో చేయి తిరిగినవాడు అంటూ అభినందిస్తోంది.