పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఫైటర్ అనే పేరు పరిశీలనలో ఉంది. ముంబైలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకుంది. కరోనా వల్ల.. ఆగిపోయింది. ఈలోగా విజయ్ మిగిలిన సినిమాలపై దృష్టి పెట్టాడు. `ఫైటర్` వెనుక కొన్ని అనుకోని ఇబ్బందులు ఉండడంతో.. `ఫైటర్` మే వరకూ మొదలు కాదన్న ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. అయితే అలాంటిదేం లేదట. ఈనెలలోనే `ఫైటర్` మొదలవ్వబోతోందని టాక్. ఈనెల 20 నుంచి ఓ షెడ్యూల్ ప్లాన్ చేశాడు పూరి జగన్నాథ్. అది ముంబైలోనా? లేదంటే హైదరాబాద్ లోనా? అన్నది తేలాల్సివుంది. 20 నుంచి ఈ నెలాఖరు వరకూ.. ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. కథ ప్రకారం…. విదేశాల్లో కొంత భాగం తెరకెక్కాలి. విదేశీ ఫైటర్లు అవసరం. కోవిడ్, స్ట్రైయిన్ ల భయాల వల్ల.. ఫారెన్ షెడ్యూల్ కుదరడం లేదు. ఫారెన్ ఫైటర్లూ అందుబాటులో లేరు. ఈ సమస్యలన్నీ గట్టెక్కితే.. ఫైటర్ ఆటంకాలు తీరిపోయినట్టే.