సామాజిక అంశాలకు కమర్షియల్ టచ్ ఇచ్చే విద్య కొరటాల శివకు బాగా అబ్బింది. మిర్చి నుంచి భరత్ అనే నేను వరకూ.. కొరటాల రూటే అది. అయితే.. తాను ఎలాంటి పాయింట్ ఎంచుకున్నా.. అది తన కల్పనలోంచి వచ్చినదే. తొలిసారి.. రియల్ స్టోరీని ఎంచుకున్నాడట. `ఆచార్య` కోసం.
చిరంజీవి – కొరటాల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం `ఆచార్య`. ఇందులో రామ్ చరణ్ సైతం ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. కాజల్ కథానాయిక. దేవాదయ భూములు, నక్సలిజం నేపథ్యంలో సాగే కథ ఇదని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోని ధర్మపురి లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథని రాసుకున్నాడట కొరటాల. అక్కడ దేవాదయ భూముల్ని కొంతమంది అక్రమార్కులు లాగేసుకున్న వైనం ఈ కథకు మూలం అని తెలుస్తోంది. దానికి చిరంజీవి స్టైల్ ఆఫ్ సీన్లు జోడించాడట. రామ్ చరణ్ పాత్ర నేపథ్యానికి కూడా ధర్మపురి సంఘటనలనే మూలమని తెలుస్తోంది. ఈ యేడాది వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.