విదేశాల్లో స్థిరపడిన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా…దేశ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికి విదేశాల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం.. ఈ సదుపాయాన్ని ఇప్పటికే కల్పిస్తోంది. తాజాగా… ఎన్నారైలు అందరికీ కల్పించాలని ఆలోచన చేస్తోంది. గతంలోనే కేంద్రం.. ద్వంద్వ పౌరసత్వ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. అ ప్రకారం.. విదేశాల్లో స్థిరపడి.. పరిమిత ప్రయోజనాల కోసం.. ఇండియన్ పౌరసత్వాన్ని కూడా కలిగి ఉండొచ్చు. ఈ ప్రకారం.. అలాంటి వారందరూ కూడా … భారత్లో ఓటు వేయడానికి అవకాశం లభించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా… ప్రవాస భారతీయులతో సమావేశం కాకుండా రారు.
ఆయనకు ప్రవాస భారతీయుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన కూడా… ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆలోచన కార్యచరణలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లో ఉన్న విధానం కాబట్టి.. కాస్త విస్తృత స్థాయిలో అమలు చేస్తే సరిపోతుంది. అయితే దాని కోసం కొంత అధికారికంగా చేపట్టాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి… రెండు మూడు నెలల సమయం పడుతుంది. అది కూడా.. ఎంతో కాలం పట్టకపోవచ్చు. వచ్చే పార్లమెంట్ సమావేశాల కన్నా ముందే జరిగే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నాటికి.. ఎన్నారైలకూ ఓటు హక్కు కల్పించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
విదేశాల్లో భారతీయులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారందరూ.. ఓట్లు వేస్తే.. చాలా లోక్సభ నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారైనా ఆశ్చర్యపోనవసరం లేదు. నిర్ణయాక స్థాయిలో వారి ఓట్లు ఉంటాయి. అదే సమయంలో.. తమ దేశ ప్రజాస్వామ్యంలో భాగం అయ్యామన్న సంతృప్తి వారికి దక్కుతుంది. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు రాకపోతే… ఎన్నారైలకు ఓటు హక్కు.. వారి ఉన్న దేశం నుంచే వినియోగించుకునే అవకాశం లభించడం ఖాయంగా చెప్పుకోవచ్చు.