సోనూసూద్ దానగుణం… ధాతృత్వం కొనసాగుతోంది. తన సేవా కార్యక్రమాలతో ప్రతీరోజూ.. ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు సోనూ. తాజాగా `ఆచార్య` సెట్లోనూ తన ధాతృత్వం కొనసాగించాడు. ఆచార్య టీమ్ కి షాక్ ఇచ్చాడు. సెట్లోని వంద మందికి వంద సెల్ఫోన్లు బహుమతిగా ఇచ్చాడు. సెట్ బోయ్స్, లైట్మెన్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్… వీళ్లందరికీ ఈరోజు.. సెట్లో సోనూ కానుకలు పంచాడు. సోనూ నుంచి ఊహించని బహుమతి రావడంతో… టీమ్ అంతా హ్యాపీగా ఫీలవుతోంది. సాధారణంగా.. హీరోలు.. షూటింగ్ చివరి రోజున టీమ్ కి ఇలాంటి కానుకలు ఇస్తుంటారు. ఈ సినిమాలో సోనూ హీరో కాదు. ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. సెట్లో పేద కళాకారుల్ని గుర్తించి, వాళ్లందరికీ సెల్ ఫోన్లు కొని ఇవ్వడం… తన చేతుల మీదుగానే వాటిని అందించడం.. నిజంగా హర్షించదగిన విషయం. వెల్ డన్ సోనూ.