వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ప్రశాంత్ కిషోర్‌ను పిలిపించారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కోసం.. పని చేస్తూ.. బీజేపీ వ్యూహాలను ఎదుర్కొనే విషయంలో మమతా బెనర్జీకి సహకరిస్తూ.. తీరిక లేకుండా ఉన్న ఆయన… ఏపీ సీఎం జగన్ కబురు పెట్టడంతో హుటాహుటిన వాలిపోయారు. ఇప్పటికీ వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా.. పీకే ఉన్నారు. ఆయన ఐ పాక్ టీం ఇప్పటికీ.. వైసీపీకి పని చేస్తూనే ఉంది. పీకే టీంలోని కొంత మందికి … ప్రభుత్వ పదవులు కూడా వచ్చాయి. అయితే.. మాస్టర్ మైండ్ పీకే… ఇప్పుడు పూర్తిగా బెంగాల్ పైనే దృష్టి పెట్టడంతో.. ఆ లోటు జగన్మోహన్ రెడ్డికి బాగా కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో మత రాజకీయాలు ఏపీలో పెరిగిపోవడం… ఆలయాలపై దాడులు ఆగకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అంతే కాదు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా.. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉందన్న అభిప్రాయంతో జగన్ ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన నేరుగానే చెప్పారు. ఆలయాలపై దాడులు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు.. ఆ ప్రచారానికి కౌంటర్ గా ఏం చేయాలన్నదానిపై.. పీకే సలహాలను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
గతంలో అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నప్పుడు.. ఓ సందర్భాన్ని సృష్టించుకుని ముస్లిం మేకోవర్‌తో వచ్చి.. కవర్ చేసిన సీఎం ఈ సారి… చంద్రబాబు కూల్చిన ఆలయాలను కట్టిస్తామని.. సంప్రదాయ దుస్తుల్లో.. హంగామా చేశారు. ఇదంతా పీకే టీం సలహానేనని భావిస్తున్నారు. గతంలో పీకే.. ఒక్క కులంపై అన్ని కులాల్ని రెచ్చగొట్టి… వైసీపీకి ఘన విజయాన్ని సాధించి పెట్టిన పీకే.. ఇప్పుడు.. మత పరంగా ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాన్ని కూడా గట్టెక్కించే బాధ్యత తీసుకోవాల్సి ఉంది. మరి పీకే.. రెచ్చగొట్టడంలోనే ఎక్స్ పర్టా.. లేకపోతే.. వాటిని చల్లబరచడంలోనూ నిపుణుడేనా అన్నది తేలాల్సి ఉంది.