దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు త్వరలోనే కెమెరా ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లుంటారు. వాళ్లెవరన్నది త్వరలో తెలుస్తుంది. ఇప్పటికైతే సమంత, శ్రియ లాంటి పెద్ద పెద్ద పేర్లే వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి… `ఓ బాబూ` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. `బాబూ` సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు దర్శకేంద్రుడు. ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమాకీ ఆ పేరే పెట్టడం… సెంటిమెంటో ఏమో తెలీదు గానీ, దాదాపుగా `ఓ బాబూ` అనే పేరే ఈ సినిమాకి చేయొచ్చని టాక్. ఈ సినిమాలో రాఘవేంద్రరావుని అంతా… `బాబూ.. బాబూ` అని పిలుస్తార్ట. అందుకే ఈ పేరు డిసైడ్ చేశారు. ప్రస్తుతం `పెళ్లి సందడి` బిజీలో ఉన్నారు దర్శకేంద్రుడు. ఆ తరవాతే.. ఈ `ఓ బాబూ` సినిమా పట్టాలెక్కుతుంది.