ఆంధ్రప్రదేశ్లో మత అలజడి రేపాలని ప్రయత్నిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని నిరూపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడంటూ… పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సోడదశి ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్ను అరెస్ట్ చేశారు. ఆయన బెంగూళురు గాసిప్స్ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ పెట్టుకుని అందులో హిందూ దేవుళ్లను తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల… ఏపీలోజరుగుతున్న ఆలయాలపై దాడుల గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. విగ్రహ ఆరాధాన వల్ల ఏమీ ఉపయోగడం ఉండదని.. వాటిని ధ్వంసం చేసిన తప్పు లేదని.. తాను స్వయంగా చాలా విగ్రహాలను ధ్వంసం చేశానని ప్రవీణ్ కుమార్ వీడియోల్లో చెప్పుకున్నాడు.
దీనిపై సీఐడీ పోలీసులకు ఫిర్యాదు రావడంతో తక్షణమే స్పందించి.. అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. అంతే కాదు.. ఓ హెచ్చరిక కూడా జారీ చేశారు. ఎవరైనా మత సామరస్యాన్ని దెబ్బతీస్తే ఊరుకునేదిలేదని ప్రకటించారు. ఇప్పటి వరకూ పోలీసులు హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎవరికైనా కేసులు పెట్టలేదు. అనేకానేక వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్న లెక్కలోకి తీసుకోవడం లేదు. దీనిపై బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో.. హఠాత్తుగా.. ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు తీసుకుని ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ ప్రవీణ్ కుమార్కు ఇదే బిజినెస్. హిందూదేవుళ్లను తిడుతూ.. మత మార్పిళ్లు చేయడమే వ్యాపారంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే అతనిపై నాలుగు కేసులు.. సైబర్ బుల్లిషీట్ కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. విమర్శలొచ్చినప్పుడు కంటి తుడుపు చర్యలు తీసుకోవడ కాకుండా.. సమస్య పరిష్కారం కోసం పోలీసులు శాశ్వతచర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం మాత్రం అంతటా వినిపిస్తోంది.