సంక్రాంతి అంటే సినిమా పండగ కూడా. బాక్సాఫీసు వద్ద సినిమా హంగామా పీక్స్ లో వుంటుంది. గత ఏడాది అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు పోటి పడ్డాయి. 2021కి వచ్చేసరికి మూడు సినిమాలు వరస కట్టాయి. రవితేజ క్రాక్, బెల్లం కొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్, రామ్ రెడ్. ఈ మూడు సినిమాలు థియేటర్ లో వున్నాయి.
రామ్ రెడ్ తండమ్ అనే తమిళ సినిమాకి రీమేక్. అక్కడ అరుణ్ విజయ్ చేశాడు. విజయ్ కి వున్న ఇమేజ్ తో ఆ కధ వర్క్ అవుట్ అయ్యింది. రామ్ విషయానికి వచ్చేసరికి రామ్ ఇమేజ్ కి కధ సూట్ అవ్వలేదు. పైగా కధనం కూడా చాలా సాదాసీదాగా సాగింది. క్రైమ్ థ్రిల్లర్ ఇది. కానీ థ్రిల్ మిస్ అయ్యింది. కమర్షియల్ హంగులు జోడించి చూసినా లాభం లేకపోయింది. టోటల్ గా రెడ్ లో రంగులేకుండా పోయింది.
బెల్లం కొండ శ్రీనివాస్ కి మళ్ళీ నిరాశ తప్పలేదు. కందిరీగ లాంటి విజయం వస్తుందని సంతోష్ శ్రీనివాస్ తో జతకట్టి శ్రీనుకి అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ కందిరీగ సినిమానే చూపించాడు దర్శకుడు. కమర్షియల్ సినిమా అంటే కొంతమందికి చాలా రాంగ్ అండర్ స్టాండింగ్ వుంది. ఏముంది ?.. నాలుగు పాటలు, మూడు ఫైట్లు.. రెండు జోకులని రంగంలో దిగితే .. అంతిమంగా అట్టర్ ఫ్లాఫ్ వస్తుంది. అల్లుడుది కూడా ఇదే రిజల్ట్. ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రీను .. ఇలాంటి కధకు ఎలా ఓకే చెప్పాడో అర్ధం కాదు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు టోటల్ తెలుగు సినిమాని ఓ రౌండ్ వేసుకుంటున్నారు. ”ఇలాంటి ఉప్మా సినిమాలు ఇంకెంత కాలం తీస్తార్రా బాబు’అని కామెంట్లు కొడుతున్నారు. టోటల్ గా ఈ ఏడాది మొదటి డిజాస్టర్ గా మిగిలిపోయింది అల్లుడు అదుర్స్.
ఈ ఏడాది మాస్ లో మరో డిగ్రీ సంపాయించాడు రవితేజ. మాస్ లో రవితేజకి పిచ్చి ఫాలోయింగ్ వుంది. అయితే చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమా ఇవ్వలేకపోతున్నాడు. కానీ క్రాక్ తో ఆ కోరిక తీరిపోయింది. పుచ్చపగిలిపోయింది. మాస్ సినిమా హిట్ అయితే థియేటర్ లో సందడి ఎలా వుంటుందో క్రాక్ చూపిస్తుంది. సంక్రాంతి కనుక మాస్ సినిమా హిట్ అయితే దాని రేంజ్ వేరు. ఆ రేంజ్ లో వుంది క్రాక్. కొత్త కధ కాదు కానీ సినిమా చూస్తున్నంత సేపు వినోదానికి డోకా లేకుండా బండి నడిపించాడు దర్శకుడు. రవితేజ ఎనర్జీని సరిగ్గా పట్టుకున్నాడు. టోటల్ గా అదిరిపోయే హిట్ కొట్టేశారు. 2021సంక్రాంతి విజేత ఎవరంటే మరో ఆలోచన లేకుండా క్రాక్ అని చెప్పొచ్చు.
ఇది సినిమా సీజన్. ఈ నాలుగు రోజులు అన్నీ సినిమాలకు టికెట్లు తెగుతాయి. కానీ సీజన్ దాటితే మాత్రం .. క్రాక్ హవానే నడుస్తుందని ట్రేడ్ టాక్.