ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు.. దాన్ని డైవర్ట్ చేయడానికి విపక్షాలపై తీవ్రమైన ఆరోపణలను.. అవాస్తవాలైనా సరే అధికారిక వ్యక్తులతో చెప్పించడం కామన్‌గా జరుగుతోంది. తాజాగా..డీజీపీ సవాంగ్.. విపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీపై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిజానికి ఆయన చెప్పిన కేసుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా.. ఆయా పార్టీల కార్యకర్తలపై లేవు. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్న కేసులు మాత్రమే ఉన్నాయి. కానీ చేస్తున్న ప్రచారం.. ఆరోపణలు మాత్రం వేరేగా ఉన్నాయి. దీనిపై ఇప్పుడు అందరూ.. డీజీపీని గురి పెట్టి విమర్శలు చేస్తున్నారు. డీజీపీ ఏ మాత్రం బాధ్యత లేకుండా ఇలా ఎందుకు ప్రకటనలు చేశారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ మొత్తం రచ్చకావడానికి అధికార పార్టీ వ్యూహాత్మ అడుగు ఉందని విపక్షాలు అనుమానిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ విగ్రహాలపై తాను దాడులు చేశానని స్వయంగా ఒప్పుకున్నారు. అనేక మత మార్పిడులు చేశానని కూడా అంగీకరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రవీణ్ లాంటి పాస్టర్ చేసిన కుట్రలను తక్షణం అత్యంత వేగంగాదర్యాప్తు చేసి బయట పెట్టాలి. కానీ ప్రవీణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కనీసం మీడియా ముందు ప్రవేశ పెట్టలేదు. అసలు విచారణ జరుపుతున్నారో లేదో కూడా క్లారిటీ లేదు. ఆ విషయంపై విపక్షాలు, మీడియాకు దృష్టి లేకుండా చేసేందుకు డీజీపీతో ఆరోపణల వ్యూహాన్ని అమలు చేశారన్న అనుమానాలు ఇప్పుడు కొంత మందిలో వ్యక్తమవుతున్నాయి.
నిజానికి పాస్టర్ ప్రవీణ్ లాంటివాళ్లు చాలా మంది ఉన్నారు. మత మార్పిళ్లే వాళ్ల లక్ష్యం . ఆ విషయం రహస్యంగా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. వారే బహిరంగంగా చెబుతూంటారు. హిందూ దేవుళ్లను కించ పరుస్తూ ప్రసంగాలు చేస్తూంటారు. అలాంటి వారందరికీ నిధులు ఎవరిస్తున్నారు..? వారి వెనుక ఉన్నదెవరు..? లాంటి వన్నీ పోలీసులు వెలుగులోకి తెస్తే.. మొత్తంగా ఏపీలో మత మార్పిడుల కుట్రలన్నీ.. వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. అయితే పోలీసులు టీడీపీ, బీజేపీలపై ఆరోపణలు చేయడంలో బిజీగా ఉన్నారు కానీ.. ఈ మూలాల సంగతి తేల్చడానికి మాత్రం ఆసక్తి చూపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.