తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఓ మిషన్ నడుస్తోంది. దాని ప్రకారం.. ముఖ్యమంత్రి మార్పు అనివార్యం.. కేటీఆర్‌కు సీఎం కిరీటం పెట్టక తప్పదు అన్న చర్చను .. టీఆర్ఎస్ నేతలు.. మంత్రులు ప్రారంభించారు. మొదట రెడ్యానాయక్ ..కేటీఆర్ సీఎం అవుతారని మరో మాట లేకుండా ప్రకటించారు. తాజాగా ఈటల రాజేందర్ .. సీఎం మార్పు ఉండొచ్చని తేల్చారు. ఎవరు మాట్లాడినా.. ముఖ్యమంత్రి మార్పు గురించి మాట్లాడేంత ధైర్యం ఉండదు. పై నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తేనే మాట్లాడతారు. ఇందులో హైకమాండ్‌కు రెండు అంశాలు ఉంటాయి… ఒకటి వారెవరికీ.. సీఎం మార్పు విషయంలో అభ్యంతరం లేదని చెప్పించడం.. రెండోది.. ప్రజలను కూడా… మానసికంగాసిద్ధం చేయడం. ముఖ్యమంత్రి మార్పు.. ముఖ్యమంత్రి మార్పు అని అదే పనిగాచర్చించడం ద్వారా.. రేపోమాపో కేటీఆర్ సీఎం అవుతారని.. అందులో వింతేం లేదని అందరూ అనుకోవడం ద్వారా.. సీఎం పీఠంపై ఆయనను కూర్చోబెట్టినప్పుడు.. పెద్దగా రియాక్షన్ రాకుండా ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఏ పని చేయాలన్నా.. ముందు ఏదో రూపంలో ప్రజల్లో ఆ అంశాన్ని చర్చకు పెడతారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనుున్నప్పుడు జరిగింది అదే. ముందస్తు ఎన్నికలు ఖాయమని.. విస్తృతంగా చర్చ జరిగేలా చేశారు కానీ.. తాను ఎక్కడా బయటపడలేదు. చివరికి రాజ్ భవన్‌కు వెళ్లి అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత మాత్రమే.. అధికారికంగా ప్రకటించారు. అప్పటి వరకూ చాలా కొద్ది మంది మాత్రమే సమాచారం ఉంది. ఇప్పుడు కేటీఆర్ ను సీఎం చేసే విషయంలోనూ అదే వ్యూహం అవలంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం టీఆర్ఎస్కు పరిస్థితి అంత బాగా లేవు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు… నాగార్జున సాగర్ ఉపఎన్నిక ముందు ఓ గండంలా ఉన్నాయి. వాటిని సక్సెస్ ఫుల్‌గా అధిగమించాల్సి ఉంది. వాటిల్లో సానుకూల ఫలితాలు వస్తే… సంతోషంగానే నాయకత్వ మార్పును క్యాడర్ ఆహ్వానించేఅవకాశం ఉంది. అయితే… ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం.. . తేడా కొట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత వ్యూహాలను ఊహించడం కష్టం. కానీ.. ఆయన మాత్రం తాను అనుకున్నది చేస్తారని.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.