హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ… ఆ నియోజకవర్గానికి తక్కువ సమయమే కేటాయిస్తున్నారు. తన పీఏల్ని ఇతరుల్ని పెట్టుకుని బండి నడిపిస్తూంటారు. అలాంటి సందర్భంలో వైసీపీ నేతలు… దూకుడుగా వ్యవహరించి.. ప్రజలకు మేలు చేసి.. బాలకృష్ణకు ఓటర్లను దూరం చేయాలి. కానీ విచిత్రంగా హిందూపురం నేతలు ప్రజల్ని పట్టించుకోకుండా.. వారికి వారు ఘర్షణలకు దిగి.. బాలకృష్ణకు మరింత మైలేజీ ఇస్తున్నారు. హిందూపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మరో పార్టీ గెలవలేదు. ఎప్పుడూ టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు.
అయితే టీడీపీ అధికారంలో లేకపోతే.. అక్కడ ఉండే ప్రతిపక్ష పార్టీ ఇంచార్జులే పెత్తనం చేస్తారు. ఇప్పుడు వైసీపీ ఇంచార్జులకు ఆ చాన్స్ వచ్చింది. తమ పార్టీ అధికారంలో ఉండటంతో ఇప్పుడు ఆ నియోజకవర్గం మొత్తం వైసీపీ నేతలే పెత్తనం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట వినే అధికారుల్ని ఎప్పటికప్పుడు బదిలీ చేసేస్తున్నారు. ఎనిమిది మంది మున్సిపల్ కమిషనర్లను మార్చారని బాలకృష్ణ ఫైరవడం దీనికి సాక్ష్యం. అయితే అటు ఎమ్మెల్యేను మంచి చేయనివ్వడం లేదు.. చివరికి వారు కూడా చేయలేకపోతున్నారు. వర్గ పోరాటంలో మునిగి తేలుతున్నారు.
హిందూపురం వైసీపీలో మొదటి నుంచి నవీన్ నిశ్చల్ అనే నాయకుడు ఉండేవారు. ఆయనను కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని జగన్ పార్టీలో చేర్చుకున్నారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి.. పార్టీలో చేర్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌కు ఎక్కడ టిక్కెట్ ఇవ్వాలో అర్థం కాక హిందూపురంలో సర్దుబాటు చేశారు. దీంతో కొత్త వర్గం తయారైనట్లయింది. ఆయన ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చారు. ఉన్న వర్గాలకు తోడు ఇక్బాల్ వర్గం కూడా.. ఇప్పుడు చురుగ్గా ఉంది. హిందూపురంలో వైసీపీ కార్యకర్తలందరూ రెండు రకాలుగా విడిపోయారు. కొంత మంది ఇక్బాల్ వైపు.. మరికొంత మంది నవీన్ నిశ్చల్ వైపు చేరిపోయారు.
రెండు వర్గాలు ప్రజలకు మేలు చేయడం సంగతేమో కానీ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాల్లో ఆరోపణలు చేసుకోవడానికి ఫుల్ టైం కేటాయిస్తున్నారు. దీంతో పోలీసులు మాజీ పోలీసు అధికారి అయిన ఇక్బాల్ వర్గానికే వత్తాసు పలుకుతున్నారు. దీంతో నవీన్ నిశ్చల్ ఫీలవుతున్నారు. ఈ గొడవల్లో.. బాలకృష్ణ మనుషులు.. టీడీపీ నేతలు సైలెంట్‌గా తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల మైలేజీ… వైసీపీ ఖాతాలో కాకుండా.. తమ ఖాతాలో పడేలా చేసుకుంటున్నారు.