క్రాక్ తో.. ట్రాక్ లోకి వచ్చేశాడు గోపీచంద్ మలినేని. ఈ సంక్రాంతికి అదే బిగ్గెస్ట్ హిట్. రెగ్యులర్ కథే అయినా.. కథనంలో చేసిన మ్యాజిక్, రవితేజ హీరోయిజం, శ్రుతి హాసన్ పాత్రని వాడుకున్న విధానం.. ఇవన్నీ క్రాక్ విజయానికి దోహదం చేశాయి. ఇప్పుడు గోపీచంద్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే `క్రాక్` కంటే ముందే.. మైత్రీలో ఓ సినిమా చేయడానికి ఫిక్సయ్యాడు గోపీచంద్ మలినేని. ఇప్పుడు అదే ఖాయంఅయ్యింది. బాలకృష్ణ తో ఓ సినిమా చేయాలని మైత్రీ మూవీస్ ఎప్పటి నుంచో అనుకుంటోంది. ఇప్పుడు బాలయ్యకూ – గోపీచంద్ మలినేనికీ జట్టు కట్టించేసింది. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాని నిర్మించడానికి మైత్రీ మూవీస్ సన్నాహాలు మొదటెట్టింది. గోపీచంద్ మలినేని సిద్ధం చేసిన కథ.. మైత్రీ మూవీస్ నిర్మాతలకు నచ్చేసింది. ఇక బాలయ్యకు కథ చెప్పడమే తరువాయి. `క్రాక్` సినిమాని ఇంకా బాలయ్య చూడలేదు. అది చూశాక.. గోపీచంద్ మలినేనికి కబురు పెడతాడట. సో.. ఈ కాంబో ఫిక్సయిపోయినట్టే.