ఈమధ్య పవన్ కల్యాణ్ ధ్యాసంతా సినిమాలపైనే వుంది. కొత్త కథల్ని ఒప్పుకోవడం, దర్శకులకు మాటివ్వడం, అడ్వాన్సులు తీసుకోవడం – ఇలా… సినిమాలపై ఫోకస్ పెరిగిపోయింది. దర్శకులు తరచూ పవన్‌ని కలుస్తూనే ఉన్నారు. క్రిష్ సినిమా సెట్లో సైతం… దర్శక నిర్మాతల హవా ఎక్కువైంది. పవన్ అప్పాయింట్‌మెంట్ కోసం కొంతమంది పడిగాపులు కాస్తున్నారు. ఈజాబితాలో వంశీ పైడిపల్లి కూడా చేరినట్టు సమాచారం.
పవన్ – క్రిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా పలుమార్లు పవన్ ని కలిశాడట వంశీపైడిపల్లి. `మహర్షి` తరవాత.. వంశీ పైడిపల్లి సినిమా ఎవరితో అన్నది ఇంకా ఖరారు కాలేదు. కొంతమంది నిర్మాతలతో కమిట్‌మెంట్స్ ఉన్నాయి గానీ, హీరో మాత్రం దొరకడం లేదు. పవన్ అయితే ఇప్పుడు ఫుల్ బిజీ. తనకున్న బిజీ షెడ్యూల్ లో కొత్త కథలు వినేంత స్కోప్ లేదు. అయినా సరే.. వంశీ పవన్ చుట్టూ వైఫైలా తిరుగుతున్నాడని టాక్. పవన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఓకే అన్నా అనేస్తాడు. అనేసినా.. వంశీ కనీసం రెండేళ్లయినా ఆగాలి. పవన్ తనతో ఇప్పటికిప్పుడు సినిమా చేయకపోయినా.. కనీసం మాటిస్తే – భవిష్యత్తులో సినిమా సెట్ చేసుకోవొచ్చన్న ఆలోచనలో ఉన్నట్టున్నాడు వంశీ. మరి ఏం జరుగుతుందో చూడాలి.