రామతీర్థం ఘటనలో తనపై దాడి జరిగిందని దానికి కారణం చంద్రబాబు, అచ్చెన్న, కళా వెంకట్రావు అంటూ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు శరవేగంగా స్పందించారు. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పోలీసులు రాజాంలోని ఆయన ఇంటి దగ్గర రాత్రి తొమ్మిది గంటల సమయంలో అరెస్ట్ చేశారు. కనీసం వంద మంది పోలీసులతో కళా వెంకట్రావు ఇంటిని చుట్టుముట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా తీసుకెళ్లారు. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయినందున.. నెల్లిమర్ల తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
కళా వెంకట్రావు అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు సంచలనం సృష్టిస్తోంది. కనీస విచారణ కూడా లేకుండా ఓ మాజీ మంత్రిని… ఏ మాత్రం ఆధారాల్లేని కేసులో అరెస్ట్ చేయడం.. ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు కోసమే.. అందర్నీ భయపెట్టాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. నోటీసులు ఇస్తే విచారణకు హాజరయ్యేవారని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పట్టపగలు హత్యలు జరిగినా నిందితుల్ని పట్టుకోవడానికి.. హత్యాయత్నాలు జరిగినా పట్టించుకోని పోలీసులు… రాజకీయ కక్ష సాధింపు కోసం పెట్టిన కేసుల్లో అరెస్టులు చేయడానికి వెనుకాడకపోవడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది.
చంద్రబాబు పర్యటనకు పోటీగా విజయసాయిరెడ్డి గంట ముందే.. రామతీర్థానికి వెళ్లారు. ఉద్రిక్తతలు తలెత్తుతాయని తెలిసినా పోలీసులు అనుమతిచ్చారు. తీా వాటర్ బాటిళ్లు, రాళ్లు, చెప్పులు పడే సరికి.. టీడీపీ నేతలే కారణమని ఫిర్యాదు చేశారు. చివరికి ఇందులో కళా వెంకట్రావును అరెస్ట్ చూపిస్తున్నారు. గతంలో చంద్రబాబు అమరావతి, విశాఖ^పర్యనటకు వెళ్లినప్పుడు.. వైసీపీ నేతలు రాళ్లు, చెప్పులు వేశారు. వాటిపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తే తప్పు కేసులు నమోదు చేయలేదు. అయినా కేసులు నమోదు చేసి సైలెంటయిపోయారు. కానీ విజయసాయిరెడ్డిపై పడిన చెప్పుల కేసులో మాత్రం.. నోటీసులు అని కూడా చూడకుండా అరెస్టులు చేస్తున్నారు.