నాగశౌర్య ఫుల్ బిజీలో ఉన్నాడు. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తున్నాడు. ఒకేసారి.. మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో… `వరుడు కావలెను` ఒకటి. ఈరోజు.. నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా `వరుడు కావలెను` నుంచి శౌర్య బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. ఓ చిన్న టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. పది సెకన్ల ఆ టీజర్లో.. శౌర్య స్టైల్ గా నడుచుకుంటూ వచ్చాడంతే. అయితే ఆ కాసేపట్లోనే శౌర్య సిక్స్ ప్యాక్ సైతం చూపించే ప్రయత్నం చేశారు. విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూల్ గా వుంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మేలో ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. `వరుడు కావలెను`తో పాటు `లక్ష్య`, `పోలీసు వారి హెచ్చరిక` చిత్రాల్లో నటిస్తున్నాడు శౌర్య,