దివంగత గాయకుడు… ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం.. పద్మ అవార్డుల ప్రకటన జారీ చేసింది కేంద్రం. 119మందికి పద్మ అవార్డులు దక్కాయి. తమిళ నాడు ప్రభుత్వం సిఫార్సు మేరకు బాలుకు పద్మవిభూషణ్ ప్రకటించారు. ప్రముఖ గాయని చిత్రకు పద్మభూషణ్ దక్కింది.
2011లో బాలుకి పద్మభూషణ్ వరించింది. బాలు మరణాంతరం బాలుకి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ మొదలైంది. అందుకోసం తమిళనాడు ప్రభుత్వం కూడా కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చింది. అయితే… బాలుకి పద్మవిభూషణ్ ఇచ్చి సరిపెట్టారు. వివిధ భాషల్లో దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడిన బాలుని సంగీత ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. భారతరత్న దక్కనప్పటికీ.. పద్మవిభూషణ్ ఇవ్వడం.. బాలుకి సముచిత సత్కారమే.