సుకుమార్ మిస్టర్ పర్‌ఫెక్ట్ టైపు. ప్రతీదీ నిదానంగానే చేస్తాడు. గబరా పడిపోవడం, హైరానా పడడం తనకు తెలీదు. సినిమాని చెక్కుకుంటూ వెళ్తాడు. రీషూట్లకీ, రీ రైట్లకీ వెనుకంజ వేయడు. అందుకే తన సినిమాలు ఆలస్యం అవుతుంటాయి. `పుష్ష`ని కూడా చాలా నిదానంగా మొదలెట్టాడు. మధ్యలో అనుకోని బ్రేకులు ఎన్నో. ఈ సినిమా ఈ యేడాది విడుదల అవ్వదని అందరి నమ్మకం. ఎందుకంటే.. సుక్కు స్పీడు అలాంటిది.
అయితే ఇప్పుడు అనూహ్యంగా `పుష్ఫ` రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈసినిమాని ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అంటే.. జులై నాటికి ఈ సినిమాని పూర్తి చేస్తారన్నమాట. ప్రస్తుతం మారేడు మల్లిలో షూటింగ్ జరుగుతోంది. ఇది చాలా పెద్ద షెడ్యూల్. ఈ షెడ్యూల్ లోనే కీలకభాగం అంతా తెరకెక్కించేస్తారు. లొకేషన్లు తక్కువ కావడం వల్ల.. సుకుమార్ కి ఈ సౌలభ్యం దొరికినట్టైంది. నిజంగా ఆగస్టు 13నే ఈ సినిమాని విడుదల చేస్తే… సుక్కు స్పీడుగా చేసిన సినిమా ఇదే అవుతుందేమో..? అయితే.. ఈసినిమాలో ప్రధాన విలన్ ఎవరన్నది ఇంకా తేలతేదు. త్వరలోనే, ఆ విలన్ ఎవరన్నదీ ఖరారైపోతుందని, సెట్లో కూడా అడుగుపెట్టేస్తాడని సమాచారం.