చిలసౌతో… కాస్త గాడిలో పడ్డాడు సుశాంత్. డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుంటే కచ్చితంగా సక్సెస్ కొడతానన్న విషయం.. చిలసౌతో తనకీ అర్థమైంది. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని `ఇచట వాహనమలు నిలపరాదు` అనే వెరైటీ టైటిల్ తో ఓ సినిమా చేశాడు. ఇప్పుడు టీజర్ విడుదలైంది.
“నా జీవితంలో బండికీ, అమ్మాయికీ, అమ్మకీ అవినాభావ సంబంధం ఉంంది“ అనే సుశాంత్ డైలాగ్ లోనే ఈ సినిమాలో మేటరేంటన్న విషయం అర్థమైపోతుంది. తాను ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న బండిని నో పార్కింగ్ ఏరియాలో పెట్టినందుకు ఏమైందన్నదే కథ. వెన్నెల కిషోర్ ని అండగా ఉంచుకుని వినోదం పిండుకుంటూ.. యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ని మిక్స్ చేస్తూ సాగిన సినిమాలా అనిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యతే వున్నట్టు కనిపిస్తోంది. మీనాక్షి చౌదరి అందంగా కనిపిస్తోంది. దర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు.