నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేసినా తమకు వ్యతిరేకంగానే చేస్తారని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. ఆయన నిబంధనల ప్రకారం వ్యవహరించినా అది తమకు వ్యతిరేకం అనుకుంటోంది. అంటే నిబంధనలు ఉల్లంఘిస్తున్న తమను ప్రశ్నించడం కూడా కుట్రగానే అనుకునే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు… ఎన్నికల పర్యవేక్షణకు… ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొత్తగా ఓ యాప్ వాడాలని అధికారులను ఆదేశించారు. ఆ యాప్ ద్వారా.. పోలింగ్ కేంద్రం లోపల మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఏం జరుగుతుందో… తెలుసుకునే సౌలభ్యం ఉందని ప్రకటించారు. ఇప్పుడీ యాప్‌పై వైసీపీకి అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇంకేముంది చంద్రబాబే చేయించారని ఆరోపణలు ప్రారంభించారు. సాక్షిలో రాయించారు.
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై పది వేల జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చామని వైసీపీ నేతలు.. పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక స్వరంతో చెబుతున్నారు. అందుకే ఏకగ్రీవాలు చేసుకోవాలని చెబుతున్నారు. ఇందు కోసం గతంలోనే ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేసింది. ఎవరైనా టీడీపీ నేతలు… అక్రమాలకు పాల్పడితే వెంటనే రికార్డు చేసి వాటిని పంపే ఏర్పాట్లు చేసింది. ఎవరూ పాల్పడకపోయినా… దొంగతనంగా వారిళ్లల్లో మద్యం పెట్టి… పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటి స్కిట్లు కూడా చేశారు. అయితే వాటన్నింటినీ కరోనా స్పాయిల్ చేసింది. తాజాగా.. అలాంటివి జరగకుండా ఉండటానికి ఎస్‌ఈీసనే యాప్ తీసుకు వచ్చారు. ఎన్నికల అక్రమాలు నిరోధించడానికి అని చెప్పారు. అయితే ఇది తమపై జరుగుతునన కుట్రగానే వైసీపీ భావిస్తోంది. అందుకే ఆ యాప్ చంద్రబాబు చేయించారని… నిమ్మగడ్డ వాడుతున్నారన్న ప్రచారాన్ని ప్రారంభించారు.
ఎన్నికల కమిషనర్ గతంలో గవర్నర్ వద్ద పని చేసినప్పుడు… ఆ సమాచారం అంతా మీడియాకు అందిందని… నిమ్మగడ్డే చెప్పారని సాక్షి కథనంలో రాసుకొచ్చింది. నిజంగా అలా చెప్పి ఉంటే.. అప్పటి గవర్నర్ నరసింహన్ పట్టుబట్టి… తన వద్ద పని చేసి రిటైరైన నిమ్మగడ్డకు… ఎస్‌ఈసీ పదవి అప్పగించి వెళ్లేవారు కాదు. చంద్రబాబు బిశ్వాల్ అనే అధికారిని ఎస్‌ఈసీగా నియమించాలని రెండు సార్లు ఫైల్ పంపినా వెనక్కి పంపి… నిమ్మగడ్డను నియమించారు. కానీ.. అప్పట్లో ఆయనేతో టీడీపీ మేలు చేశారని తమ మార్క్ అనుమానాలను ప్రజల్లో పంపడానికి సాక్షి తన వంతు ప్రయత్నం చేసింది.
కొసమెరుపేమిటంటే.. అసలు యాప్ సాక్ష్యం కాదట. వెబ్ కాస్టింగ్ అబ్జెక్టివ్… యాప్ సబ్జెక్టివ్ అనే కొత్త వాదనను ప్రభుత్వం తీసుకు వచ్చింది. యాప్‌లో సాక్ష్యాలను తమకు అనుకూలంగా మల్చుకుంటారట. దీన్ని ఎవరు చెప్పారంటే.. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఐఏఎస్ అధికారి అట. సక్రమంగా ఎన్నికలు ఎదుర్కోలేక.. సర్కస్ పీట్లు చేయడం అంటే ఇదే అనే విమర్శలు ఇలాంటి వాటిని చూస్తే సహజంగానే వస్తున్నాయనే విమర్శలు ఇలాంటి కథనాల వల్లే వస్తాయి. కానీ వ్యూహం వారి మద్దతు దారుల్లో అయినా ఓ అనుమాన బీజం నాటడం. సాక్షి అందు కోసం తన ప్రయత్నం తాను చేస్తోంది.