టాలీవుడ్ లో విడుదల తేదీల జాతర కనిపిస్తుంది. సెట్స్ మీద వున్న సినిమాలు వరుసగా డేట్స్ లాక్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ రిలీజ్ టైం లాక్ అయ్యింది. 2022 సంక్రాంతికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.
దీంతో పాటు ఓ కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మహేష్ బాబు తాళల గుత్తి పట్టుకొని నిలబడి పోస్టర్ ఇది. ‘గీత గోవిందం’ లాంటి క్లాస్ హిట్ తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్. తమన్ బాణీలు సమకూరుస్తున్నారు.