హ్యాపీ డేస్ సినిమాతో యువతని ఉర్రూతలూగించాడు మిక్కీ జే మేయర్. ఎక్కడ విన్నా మిక్కీ మ్యాజిక్కే. అయితే మిక్కీ పై క్లాస్ ముద్ర పడిపోయింది. దీంతో బడా హీరోలు, భారీ సినిమాల లీగ్ లో చేరలేకపోయాడు. మాస్, బాడా హీరోలకు మ్యూజిక్ చేసే అవకాశం కీరవాణి, మణిశర్మ తర్వాత దేవిశ్రీ, తమన్ అందుకున్నట్లు మిక్కీకి మాత్రం రాలేదు. మధ్యలో త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం వచ్చినా.. అది ‘అఆ’ లాంటి క్లాస్ సినిమాకే పరిమితమైయింది.
అయితే ఎట్టకేలకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా పడింది మిక్కీకి. ప్రభాస్ సినిమాకి మ్యూజిక్ చేసే అవాకాశం అందుకున్నాడు మిక్కీ. నాగ్ అశ్విన్, ప్రభాస్ కలయికలో రానున్న సినిమాకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే పేరుని ఖారారు చేశారు. ఈ రోజు దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. నాగ్ అశ్విన్ కి మహానటి లాంటి క్లాస్ ఆల్బమ్ ఇచ్చాడు మిక్కీ. అయితే ప్రభాస్ లాంటి బడా హీరోకి మిక్కీని కొనసాగిస్తారా ? అనే చిన్న సందేహం. కానీ నాగ్ అశ్విన్ ఈ విషయంలో తన టేస్ట్ చాటుకున్నాడు. కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా మిక్కీ ట్యాలెంట్ పైనే భరోసా వుంచాడు. మిక్కీ మంచి డెప్త్ వున్న మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఇప్పటివరకూ క్లాస్ కే పరిమితమైపోయాడు. నాగ్ అశ్విన్ కి ప్రభాస్ కి వున్న ఇమేజ్ తెలియంది కాదు. సో.. ఈ విలక్షణమైన కలయికతో మాత్రం కొత్తదనం వున్న ఆల్బమ్ వినే అవకాశం ఆడియన్స్ కి కలుగుతుందని చెప్పుకోవాలి.