యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నీలీ నీలీ ఆకాశం.. ఇద్దామనుకున్నా – పాట మహత్య్మమో, ఏమో.. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్సే వచ్చాయి. కానీ.. రిపోర్ట్ మాత్రం బ్యాడ్ గా వుంది. పునర్జన్మలూ, స్పోర్ట్స్, సెంటిమెంట్, జంబలకిడి పంబ.. ఇలా అన్ని కాన్సెప్టులూ కలిపేసి, కలగాపులగం చేసేశాడు దర్శకుడు.
నిజానికి ఈ కథ చాలామంది హీరోల చుట్టూ తిరిగింది. గీతా ఆర్ట్స్ ముందు ఈ కథని ఓకే చేసింది. అల్లు శిరీష్ ఈ సినిమాలో నటించాల్సింది. స్క్రిప్టు అంతా ఓకే అయ్యాక… ఎందుకో.. శిరీష్ డ్రాప్ అయ్యాడు. సాయిధరమ్ తేజ్ కీ ఈ కథ వినిపించారు. నిఖిల్ లాంటి యంగ్ బ్యాచ్ హీరోల చుట్టూ ఈ కథ ఓ రౌండ్ కొట్టింది. చివరికి.. ప్రదీప్ ఓకే చేశాడు. ప్రదీప్ నమ్మకం కూడా ఒకటే. `గీతా ఆర్ట్స్ ఓకే అందంటే.. ఈ కథ లో చాలా విషయం వున్నట్టే వుంది` అని స్ట్రాంగ్ గా నమ్మాడు ప్రదీప్. కానీ.. ఫలితం రివర్స్ అయ్యింది. మరి ఈ కథని అంతకు ముందు గీతా ఆర్ట్స్ ఎలా ఓకే చేసిందో??