గత రెండు రోజుల నుంచి టాలీవుడ్ లో ఒకటే హడావుడి. కొత్త సినిమాల రిలీజ్ డేట్లు వరుస కట్టాయి. ఇంతకు మించి మంచి ముహూర్తమే లేదన్నట్టు… నిర్మాతలు రిలీజ్ డేట్ లు ప్రకటించేసి – అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని అందించారు. దాదాపు ప్రతీ పెద్ద హీరో సినిమాకీ డేట్ ఫిక్సయిపోయింది. రిలీజ్ డేట్ విషయంలో ఎప్పుడూ ఓ నిర్ణయానికి రాలేని రాజమౌళి సైతం.. `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసేశాడు.
అయితే నందమూరి బాలకృష్ణ సినిమాకి సంబంధించిన అప్డేటే రాలేదు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి నందమూరి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ బోయపాటి మాత్రం ఎలాంటి అప్ డేటూ ఇవ్వడం లేదు. కనీసం టైటిల్ ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ని మే, లేదా జూన్లలో విడుదల చేస్తారని సమాచారం. టైటిల్ తో పాటు, రిలీజ్డేట్ నీ ఒకే సారి విడుదల చేయాలని.. బోయపాటి భావిస్తున్నాడట. ఇప్పటికే రిలీజ్ డేట్ , టైటిల్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని… త్వరలోనే అధికారికంగా ప్రకటించేస్తారని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య కూడా వేసవి బరిలోనే దిగబోతున్నాడన్నమాట.