రిలీజ్ డేట్స్ జాతర కొనసాగుతోంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్ లను ప్రకటించేసి… విడుదలకు రంగం సిద్ధం చేసేస్తున్నాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ వంతు వచ్చింది. `వకీల్ సాబ్` రిలీజ్ డేట్ నిచిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన `పింక్`కి ఇది రీమేక్. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. సంక్రాంతికి రావల్సిన సినిమా ఇది. కానీ… వేసవికి షిఫ్ట్ అయ్యింది. అన్ని సినిమాల రిలీజ్ డేట్లని… ప్రకటించేస్తున్నా.. `వకీల్ సాబ్` రిలీజ్ డేట్ రాలేదు. మార్చి 26న ఈ సినిమా వస్తుందనుకున్నారు. కానీ అదే రోజున మరో మూడు సినిమాలు ఉండడంతో.. ఆ డేట్ `వకీల్ సాబ్`కి దొరకలేదు. ఇప్పుడు ఏప్రిల్ 9న ఫిక్సయ్యాడు.