రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నచిత్రం `ఖిలాడీ`. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా.. చిన్న టీజర్ ని కూడా వదిలారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేయనున్నారు. అన్నట్టు… ఈ సినిమాలో రవితేజని ఢీ కొట్టే పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నాడు. `ఖిలాడీ`లో ప్రతినాయకుడు ఆయనే. ఈ విషయాన్ని అర్జున్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తన అభిమానులకు తెలియజేశారు. ఇటీవల అర్జున్‌కి తెలుగులో మంచి పాత్రలే దక్కుతున్నాయి. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`లో అల్లు అర్జున్ కి తండ్రి గా నటించాడు అర్జున్. ఇప్పుడు రవితేజని ఢీ కొట్టబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే అర్జున్ `ఖిలాడీ` సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.