ఖైదీ లాంటి సూపర్ హిట్ తో ఫామ్ లోకి వచ్చాడు కార్తీ. ఇప్పుడు `సుల్తాన్`పైనా భారీ అంచనాలే ఉన్నాయి. కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నారు. ఇప్పుడు టీజర్ వచ్చింది
“భారతం చదివావా.. కృష్ణుడు వంద అవకాశాలు ఇచ్చినా… కౌరవులు మారలేదు. నువ్వడిగింది ఒక్క అవకాశమే కదా. ఇస్తా” అని విలన్ అంటే..
“మహాభారతంలో కృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నాడు. అదే కౌరవుల పక్షంలో ఉంటే. అదే భారతాన్ని యుద్ధం లేకుండా ఊహించుకోండి సార్” అని కార్తీ చెప్పిన డైలాగ్.. ఈ టీజర్లో కనిపించింది.
అంటే.. భారతంలాంటి కథన్నమాట. కార్తీ.. కృష్ఱుడి తరహా పాత్ర పోషిస్తున్నాడు. మరి కౌరవులు, పాండవులూ ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. టీజర్.. ఆసక్తికరంగా ఉంది. ఆ ఇంటెన్సిటీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ రక్తి కట్టాయి. ఫైట్లూ, విలనిజం, మైండ్ గేమ్ ఇవన్నీ చిన్న టీజర్లోనే చూపించేశారు. మొత్తానికి రొటీన్ కి భిన్నమైన కథేదో తెరపై చూడబోతున్నామన్న విషయం తెలిసేలా చేశారు. మరి ఈ సుల్తాన్ ఏం చేస్తాడడో? కార్తీకి ఎలాంటి హిట్ ఇస్తాడో??