`ఉప్పెన` సినిమాని తన సినిమాగా భావిస్తూ వచ్చాడు సుకుమార్. శిష్యుడు బుచ్చిబాబుకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించినా… సుకుమార్ తన కళ్లన్నీ.. ఈ సినిమాపై పెట్టాడు. సుకుమార్ సలహాలు, సూచనలు ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. సినిమా పూర్తయిన తరవాత కూడా సుకుమార్ కొన్ని మార్పులు చెప్పడంతో, దాని అనుగుణంగా రీషూట్లు చేసి, ఉప్పెనని సిద్ధం చేశారు. ఈసినిమా ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. అయితే చివరి క్షణాల్లో సుకుమార్ మళ్లీ.. రీపేర్లు మొదలెట్టాడని తెలుస్తోంది.
స్క్రీన్ ప్లేలో సుకుమార్ చిన్న చిన్న మార్పలు చేశాడని, కొన్ని సన్నివేశాల ఆర్డర్ని అటూ ఇటూ చేశాడని, దాంతో… కథనం మరింత పట్టుగా సాగిందని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాల్ని మరింత ట్రిమ్ చేయడంతో… ఇప్పుడు సినిమా షార్ప్ గా వచ్చిందట. ఇటీవల సినిమాని చిరంజీవి కూడా చూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇతర మెగా హీరోలందరికీ ఓ ప్రత్యేకమైన షో వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి.