చదరంగంలో… రాజు, మంత్రే కాదు. భటుడు, గుర్రం, ఏనుగు, ఒంటె కూడా ఉంటాయి. ఒకొక్కదానికీ ఒకొక్క బలం. బంటుని చాలామంది తక్కువ అంచనా వేస్తారు. నిజానికి యుద్ధం మొదలు పెట్టేదే అది. అచ్చంగా.. చదరంగంలో పావుల్లా… కొన్ని పాత్రలు – వాటి చుట్టూ ఓ కథ… ఇదీ `చెక్`. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది.
మరణ శిక్ష అనుభవిస్తున్న ఓ హీరో. తనకు చెస్ అంటే.. చాలా ఇష్టం. విశ్వనాథన్ ఆనంద్ లా.. ఆడేస్తుంటాడు. తనని ఎలాగైనా ఈ కేసు నుంచి బయటకు తీసుకురావాలని ఓ లాయర్ (రకుల్ ప్రీత్) ప్రయత్నిస్తుంటుంది. మరి తన చదరంగం తెలివితేటలతో హీరో… ఆ జైలు నుంచి ఎలా బయటకు వచ్చాడు? అన్నదే మిగిలిన కథ. ట్రైలర్లోనే కథ చెప్పే ప్రయత్నం చేశారు. పేరుకు తగ్గట్టే… మూమెంట్స్ థ్రిల్లింగ్ గా ఉన్నాయి. డైలాగుల్లోనూ పదును వుంది. కల్యాణీ మాలిక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ప్లస్ అయ్యింది. రకుల్ ది విభిన్నమైన పాత్ర అని తెలిసిపోతోంది. నితిన్ కి కూడా ఇందులో రెగ్యులర్ హీరోయిజం చూపించే స్కోప్ లేదు. మొత్తానికి ఓ కొత్త తరహా సినిమా చూడబోతున్నామన్న ఫీలింగ్ కలిగించింది `చెక్`. ఇక సినిమా ఎలా ఉంటుందో?