రెండ్రోజుల క్రితం ఓ వెరైటీ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అక్టోబరు 1న సినిమాని విడుదల చేస్తున్నాం.. అనే ప్రకటన అది. సాధారణంగా.. చాలా సాధారణమైన ప్రకటన అది. కాకపోతే.. అందులో హీరో పేరు లేదు. హీరోయిన్ ఎవరో తెలీదు. దర్శకుడూ, బ్యానర్ ఇలాంటివేం లేదు. అందుకే…. అవన్నీ… తమపై తాము సెటైర్లులా వేసుకుని `ఊరికి ముందే… అక్టోబరు 1న విడుదల అనే ప్రకటన ఏమిటో` అంటూ తమపై తామే కౌంటర్ వేసుకున్నారు.
ఇప్పుడు ఆ కర్చీఫ్ ఎవరిదో తెలిసిపోయింది. అది గోపీచంద్ – మారుతి కాంబినేషన్ కు సంబంధించిన పోస్టర్. ప్రతీ రోజూ పండగే తరవాత.. మారుతి – గోపీచంద్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని అక్టోబరు 1న విడుదల చేయాలని ఫిక్సయ్యారు. అందుకే.. క్లాప్ కొట్టక ముందే, హీరోయిన్ ఎవరో తెలియకముందే, టైటిల్ ఎనౌన్స్ చేయకముందే రిలీజ్ డేట్ చెప్పేశారు. అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేస్తామని.. తాజాగా మరో ప్రకటనలో తెలిపింది చిత్రబృందం. ఈ చిత్రానికి `పక్కా కమర్షియల్` అనే పేరు పరిశీలిస్తున్నారు. టైటిల్ లో కమర్షియాలిటీ ఉన్నా.. మారుతి మాత్రం కాస్త క్రియేటీవ్ గానే ఆలోచిస్తున్నాడు. మరి సినిమా ఎలా ఉంటుందో?